https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: జబర్ధస్త్ ప్రియాంక ‘లవ్’ట్రాక్..యాంకర్ రవి బట్టలూడదీశారు

Bigg Boss 5 Telugu:  బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో ఈసారి అంతకు మించిన కామెడీ పండడం ఖాయంగా కనిపిస్తోంది. షోను ఘనంగా ప్రారంభించిన కింగ్ నాగార్జున ఏకంగా 19 మంది కంటెస్టెంట్లను ఆదివారం బిగ్ బాస్ హౌస్ లోకి పంపాడు. ఒక్కొక్కరూ ఒక్కో రంగం నుంచి రావడం.. రెండో రోజే నామినేషన్ లో పొట్లాడుకోవడం.. ఏడ్వడం.. హీట్ పెంచింది. ఇక మూడో రోజు బిగ్ బాస్ లో కామెడీ ఓ రేంజ్ లో సాగినట్టుగా […]

Written By:
  • NARESH
  • , Updated On : September 7, 2021 / 05:18 PM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu:  బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో ఈసారి అంతకు మించిన కామెడీ పండడం ఖాయంగా కనిపిస్తోంది. షోను ఘనంగా ప్రారంభించిన కింగ్ నాగార్జున ఏకంగా 19 మంది కంటెస్టెంట్లను ఆదివారం బిగ్ బాస్ హౌస్ లోకి పంపాడు. ఒక్కొక్కరూ ఒక్కో రంగం నుంచి రావడం.. రెండో రోజే నామినేషన్ లో పొట్లాడుకోవడం.. ఏడ్వడం.. హీట్ పెంచింది. ఇక మూడో రోజు బిగ్ బాస్ లో కామెడీ ఓ రేంజ్ లో సాగినట్టుగా తెలుస్తోంది.

    తాజాగా స్టార్ మా విడుదల చేసిన మూడో రోజు ప్రోమో నవ్వులు పూయిస్తోంది. ముఖ్యంగా కమెడియన్ లోబో(Lobo) బాత్రూంలో డ్రాయర్లు ఆరేసిన లేడీ కంటెస్టెంట్లకు కామెడీగా హెచ్చరించిన తీరు నవ్వులు పూయించింది. నా జేబులో ఆరేసుకోండి అని అన్న మాట హౌస్ లో నవ్వులు పూయించింది.

    ఇక అంతేకాదు.. బిగ్ బాస్ లోకి ట్రాన్స్ జెండర్ గా ఎంట్రీ ఇచ్చిన జబర్ధస్త్ ప్రియాంక సింగ్(Priyanka Sing) కూడా అప్పుడే లవ్ ట్రాక్ మొదలు పెట్టడం గమనార్హం. హౌస్ లోని మగాళ్లందరినీ అన్నయ్యలు అని అన్న ప్రియాంక.. ఒక్క మానస్ మాత్రం తనకు అన్నయ్య కాదు అనడంతో హౌస్ లో అంతా గేలిచేశారు. ‘మానస్ ’తో ప్రియాంక లవ్ ట్రాక్ మొదలెట్టేసిందో పో అని యాంకర్ రవి సహా కంటెస్టెంట్లు అల్లరి చేశారు.

    ఇక ‘పవర్’ రూమ్ లోకి మొదటగా ఎంట్రీ ఇచ్చిన విశ్వ.. యాంకర్ రవి(Anchor Ravi), ప్రియ పూర్తి బట్టలను హౌస్ నుంచి పంపించేలా ఆదేశించాడు. దీంతో అమ్మాయిల నైటీ వేసుకొని యాంకర్ రవి కామెడీ చేసిన తీరు నిజంగానే నవ్వులు పూయించింది. ఈరోజు షో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉందని ప్రోమో చూస్తేనే తెలుస్తుంది. మరి అది ఎంత రేంజ్ లో నవ్విస్తుందనేది ఈరోజు రాత్రి షో చూస్తే కానీ తెలియదు.. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే.