Draupadi Murmu Nomination: రాష్ట్రపతి ఎన్నికకు కేంద్రం సిద్ధమవుతోంది. తమ అభ్యర్థిగా బీజేపీ ద్రౌపది ముర్మును ప్రకటించి ముందుకు వెళ్తోంది. ఇవాళ నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వంటి హాజరు కానున్నారు. దీంతో ద్రౌపది ముర్ము విజయం ఖాయమనే తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్షాలు సైతం తమ అభ్యర్థిని నిలబెడతాయని ప్రచారం సాగినా ఆ ప్రయత్నాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్ము గద్దెనెక్కడం లాంఛనమే అని తెలుస్తోంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు బీజేపీకే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో ద్రౌపది ముర్మువిజయం ఇక నల్లేరు మీద నడకే అని చెబుతున్నారు. మహారాష్ట్ర సంక్షోభంతో ప్రతిపక్షాలు ఎటు తేల్చుకోలేకపోతున్నాయి. రాష్ట్రపతిగా గిరిజన మహిళ ఎన్నిక కావడం చరిత్రగా మిగులుతుందని వైసీపీ పేర్కొంది. అందుకే ద్రౌపది ముర్ముకే తమ మద్దతు ఇస్తామని చెబుతోంది. దీంతో బీజేపీకి బలం పెరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికలో తమకు అన్ని పక్షాలు మద్దతు ఇస్తాయనే ఆశ బీజేపీలో కలుగుతోంది.
Also Read: Karate Kalyani: ప్రేమ పెళ్లి పేరుతో మోసం వాడుకుని వదిలేశారు… పిల్లల్ని కనాలనే ఆశ ఇంకా ఉంది
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రచారం చేయనున్నారు. ఇవాళ నామినేషన్ వేసి ఇక ప్రతి రోజు రెండు రాష్ట్రాలు తిరగాలని ప్రణాళికలు రచించారు. దీంతో ద్రౌపది ముర్ము దేశవ్యాప్తంగా పర్యటించి అందరి మద్దతు కూడగట్టుకోవాలని భావిస్తున్నారు. రొటీన్ లా కాకుండా గిరిజన మహిళను ఎంపిక చేసి బీజేపీ అందరికి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్ము సేవలు దేశం అందుకోవాలనే ఆలోచనలో భాగంగానే ఆమెను ఎంపిక చేసి ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక బలాబలాల విషయంలో కూడా ఆమెకు తిరుగులేదని తెలుస్తోంది. ద్రౌపది ముర్ముకు అన్ని పార్టీలు మద్దతు తెలిపే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే వైసీపీ తమ మద్దతు తెలపడంతో మిగతా పార్టీలు కూడా ఆమెకు ఓటు వేసేందుకు ముందుకు వస్తాయని చెబుతున్నారు. దేశానికి మొట్టమొదట గిరిజన మహిళగా రాష్ట్రపతి పీఠాన్ని అలంకరించే రెండో మహిళగా రికార్డు సృష్టిస్తారనే అందరు ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ద్రౌపది ముర్ము ఎన్నికపైనే అందరికి ఆసక్తి నెలకొంది.
Also Read:Jagan Government: కీలక నిర్ణయాలు దిశగా జగన్ సర్కారు.. కేబినెట్ లో చర్చించే అంశాలివే..