Rajendra Prasad’s Son: మన టాలీవుడ్ లో లెజెండరీ నటులలో ఒక్కరు రాజేంద్ర ప్రసాద్..కామెడీ హీరో గా ఈయనకి అప్పట్లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ సినిమాలు మెగాస్టార్ చిరంజీవి తో సమానంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడేవి..కేవలం కమర్షియల్ మాస్ హీరోలు మాత్రమే ఇండస్ట్రీ ని ఏలుతున్న ఆ సమయంలో అందరూ వెళ్తున్న దారిలో కాకుండా సరికొత్త పంథా ఎంచుకొని కామెడీ హీరోగా సరికొత్త చరిత్ర సృష్టించాడు రాజేంద్ర ప్రసాద్..నేడు ఇండస్ట్రీ లోకి వస్తున్నా మరియు రాబోతున్న ఎంతో మంది కామెడీ హీరోలకు ఈయనే స్ఫూర్తి..అయితే వయస్సు మీద పడడం తో హీరో గా మార్కెట్ కోల్పోయిన తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా అద్భుతంగా రాణించాడు..ఇప్పటికి కూడా క్యారక్టర్ ఆర్టిస్టుగా రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు అనే చెప్పాలి..ఇటీవలే ఆయన నటించిన F3 సినిమా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం గా నిలిచినా సంగతి మన అందరికి తెలిసిందే..తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు రాజేంద్ర ప్రసాద్.
Also Read: Draupadi Murmu Nomination: నేడే ద్రౌపది ముర్ము నామినేషన్.. వైసీపీ మద్దతు వారికే
సుమారు నాలుగు దశాబ్దాల నుండి ప్రేక్షకులను అలరిస్తున్న రాజేంద్ర ప్రసాద్, తన తర్వాత లెజసీ ని ఆయన కుమారుడు బాలాజీ ప్రసాద్ మోస్తాడు అనుకున్నాడు..ఆయనని సినిమాల్లో రప్పించడానికి రాజేంద్ర ప్రసాద్ అప్పట్లో చాలా ప్రయత్నాలే చేసాడు..మొత్తానికి తన కొడుకుని పెద్ద హీరోని చెయ్యాలనే కలతో ప్రముగా దర్శకుడు K రాఘవేంద్ర రావు గారితో అప్పట్లో ఘనంగా ఒక సినిమాని కూడా ప్రారంభించారు..కొంత వరుకు షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా బడ్జెట్ సమస్యల కారణంగా మధ్యలోనే ఆగిపోయింది..దీనితో ఈ రంగం లో మనం రాణించలేము అని బాలాజీ ప్రసాద్ కి స్పష్టం గా అర్థమైంది అట..దీనితో తండ్రి ఇష్టాన్ని కూడా కాదని వ్యాపార రంగం లోకి అడుగుపెట్టాడు..ఇంపోర్ట్స్ అండ్ ఎక్సపోర్ట్స్ బిజినెస్ ని స్థాపించి నేడు దేశంలోనే గొప్ప వ్యాపారివేతలలో ఒకడిగా మారాడు..ఈయన పెళ్లి కూడా రాజేంద్ర ప్రసాద్ పదేళ్ల క్రితం ఘనంగా జరిపించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ వివాహానికి టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు మరియు వ్యాపారవేత్తలు హాజరయ్యారు..ఈయన మనవరాలు మహానటి నటి సినిమాలో కీర్తి సురేష్ చిన్నప్పటి క్యారక్టర్ కూడా చేసింది..అలా పెద్ద హీరో అవ్వాల్సిన రాజేంద్ర ప్రసాద్ కుమారుడు బాలాజీ ప్రసాద్..నేడు గొప్ప పారిశ్రామిక వేత్త అయ్యాడు.
Also Read: Karate Kalyani: ప్రేమ పెళ్లి పేరుతో మోసం వాడుకుని వదిలేశారు… పిల్లల్ని కనాలనే ఆశ ఇంకా ఉంది
Recommended Videos