https://oktelugu.com/

Karate Kalyani: ప్రేమ పెళ్లి పేరుతో మోసం వాడుకుని వదిలేశారు… పిల్లల్ని కనాలనే ఆశ ఇంకా ఉంది

Karate Kalyani: టాలీవుడ్ లో కరాటే కళ్యాణికి ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ తరపున జాయింట్ సెక్రటరీ పదవికి పోటీ చేసి ఆమె ఓడిపోయారు. ఇక యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డితో కరాటే కళ్యాణి వివాదం పెద్ద రచ్చకు దారితీసింది. అసభ్యంగా ప్రవర్తించాడంటూ అర్ధరాత్రి నడిరోడ్డులో శ్రీకాంత్ ని ఆమె బట్టలు చిరిగేలా కొట్టారు. ఇది పెద్ద న్యూసెన్స్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : June 24, 2022 12:48 pm
    Follow us on

    Karate Kalyani: టాలీవుడ్ లో కరాటే కళ్యాణికి ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ తరపున జాయింట్ సెక్రటరీ పదవికి పోటీ చేసి ఆమె ఓడిపోయారు. ఇక యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డితో కరాటే కళ్యాణి వివాదం పెద్ద రచ్చకు దారితీసింది. అసభ్యంగా ప్రవర్తించాడంటూ అర్ధరాత్రి నడిరోడ్డులో శ్రీకాంత్ ని ఆమె బట్టలు చిరిగేలా కొట్టారు. ఇది పెద్ద న్యూసెన్స్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కరాటే కళ్యాణి, శ్రీకాంత్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన నాపై కేసు పెట్టాడంటూ సీఐ పై కరాటే కళ్యాణి అసహనం వ్యక్తం చేశారు.

    Karate Kalyani

    అదే సమయంలో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్రమంగా ఓ చిన్నారిని కళ్యాణి పెంచుకుంటున్నారనే ఆరోపణలపై దాడులు జరిగాయి. తన ఇంట్లో పెరుగుతున్న చిన్నారి ఎవరో మీడియా ద్వారా కరాటే కళ్యాణి స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే ఆమె తాజా సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. ఆమె మగ జాతిని విమర్శిస్తూ సుదీర్ఘ సందేశం విడుదల చేశారు.

    Also Read: Tollywood Heroine Self-Destruction: ఆత్మహత్య చేసుకొని చనిపోయిన మరో హీరోయిన్.. శోక సంద్రం లో టాలీవుడ్

    ఆమె సోషల్ మీడియా సారాంశం ఏంటంటే.. మగాళ్లు మొదట్లో బుజ్జి కన్నా అంటూ మాయలో పాడేసుకుంటారు. నీకు మానసికంగా, శరీరకంగా దగ్గరవుతారు. ఎప్పుడైతే నువ్వు అతన్ని ప్రేమించడం మొదలుపెడతావో అసలు రూపం బయటికి తీస్తారు. నీపై లేనిపోని కండీషన్స్ పెడతారు. వినకపోతే వదిలేస్తానని భయపెడతారు. తాగొచ్చి కొడతారు. డబ్బుల కోసం హింసిస్తారు. మన అందమే మన శత్రువు. ఆ అందం కోసం మనకు దగ్గరైన మగాళ్లు మనల్ని లోబరుచుకుని తర్వాత హింసిస్తారంటూ… అమ్మాయిలకు కరాటే కళ్యాణి హిత బోధ చేసింది.

    Karate Kalyani

    కరాటే కళ్యాణి ఇప్పటికే రెండు సార్లు వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఇద్దరితో కూడా ఆమెకు పొసగలేదు. ప్రస్తుతం ఆమె ఒంటరిగా ఉంటున్నారు. కానీ కరాటే కళ్యాణికి తల్లి కావాలనే ఆశ బలంగా ఉందట. మళ్ళీ పెళ్లి చేసుకొని తల్లి కావాలనేది ఆమె కోరిక అట. తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. గతంలో ఉంటే చికిత్స చేయించుకున్నాను. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొన్న కరాటే హౌస్ నుండి బయటకు వచ్చాను పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి.

    Also Read:Anasuya: సిల్క్ శారీలో సూపర్ సెక్సీగా… అందాల దాడి చేసిన అనసూయ!
    Recommended Videos


    Tags