National Popcorn Day 2025 : జనాలు సినిమా థియేటర్(Cinema Theatre) కు వెళ్లినప్పుడు కచ్చితంగా అక్కడ కూర్చుని రుచికరమైన పాప్‌కార్న్(Popcorn)ను ఆస్వాదిస్తారు. ఇది సినిమా ప్రేక్షకులకు రుచికరమైన చిరుతిండిని తయారు అందించడమే కాకుండా సినిమాను ఎంజాయ్ చేయడంలో సాయం చేస్తుంది. ఈ ప్రపంచంలో తినడానికి చాలా ఉన్నప్పుడు మనం సినిమా చూస్తున్నప్పుడు మాత్రమే పాప్‌కార్న్ ఎందుకు తింటామనే ప్రశ్న చాలా మంది మదిలో తలెత్తుతూనే ఉంది. కాబట్టి పాప్‌కార్న్ డే చరిత్ర, ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం జనవరి 19ను నేషనల్ పాప్‌కార్న్ డే(National Popcorn Day)గా జరుపుకుంటారు. పాప్‌కార్న్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇష్టమైన స్నాక్. సినిమా థియేటర్‌లు, పండగ వేళలు, టీవీ చూస్తూ గడుపుతున్నప్పుడు పాప్‌కార్న్ తోడుగా ఉంటేనే ఆ మజానే వేరు. ఈ ప్రత్యేక రోజున పాప్‌కార్న్ ఎప్పటి నుంచి మన దైనందిన జీవితంలో భాగమైందో, దీని వెనుక ఉన్న చరిత్ర గురించి తెలుసుకుందాం.
పాప్‌కార్న్ చరిత్ర
పాప్‌కార్న్ తినే అలవాటు వేల సంవత్సరాల క్రితం నుండి ఉంది. మాయన్ , అజ్టెక్ ప్రజలు తొలుత ఈ స్నాక్‌ను తమ భోజనంలో భాగంగా తీసుకున్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. మొక్క జొన్నను వేడి చేసి బుర్రలు పగలగొట్టి తయారుచేసిన ఈ పాప్‌కార్న్, అప్పట్లో సంపన్న కుటుంబాల రుచికరమైన అల్పాహారంగా ప్రసిద్ధి పొందింది.
మోడ్రన్ పాప్‌కార్న్ పుట్టుక
19వ శతాబ్దంలో పాప్‌కార్న్ తయారీ మరింత సులభమైంది. 1885లో చార్లెస్ క్రేటర్ అనే వ్యక్తి మొట్టమొదట పాప్‌కార్న్ మెషిన్(Popcorn mechine) ను రూపొందించాడు. దీని ద్వారా పాప్‌కార్న్ ను త్వరగా పెద్ద పరిమాణంలో తయారుచేయడం మొదలైంది.
సినిమా థియేటర్లలో పాప్‌కార్న్
1930ల గ్రేట్ డిప్రెషన్ సమయంలో పాప్‌కార్న్ ధర తక్కువగా ఉండటంతో అది సినిమా థియేటర్లలో ముఖ్యమైన స్నాక్‌గా మారింది. అప్పటి నుండి ఇప్పటివరకు సినిమా చూడడం పాప్‌కార్న్ లేకుండా అసంపూర్ణమనే చెప్పాలి.
ఎందుకు ప్రత్యేకమైనది పాప్‌కార్న్?
పాప్‌కార్న్ లోపల ఉన్న తేమ వేడి వల్ల వ్యాప్తి చెంది, గింజల తత్వాన్ని మార్చడం వల్ల ఇవి పగులుతాయి. ఇది సహజమైన, ఆరోగ్యకరమైన అల్పాహారంగా పరిగణించబడుతుంది. చక్కెర, మిరియాలు, చీజ్ వంటి రుచులతో దీనికి వేర్వేరు హంగులు జోడించవచ్చు.
ఆరోగ్యానికి మేలు
* పాప్‌కార్న్ పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది.
* ఈ స్నాక్ చలికాలంలో వేడి ప్రేరేపించడంతో పాటు తేలికైన ఆహారంగా మారుతుంది.
* లో ఫ్యాట్ ఆప్షన్ కావడంతో ఆరోగ్యంతో కూడిన స్నాక్‌గా పరిగణించబడుతుంది.
ఈ రోజును ఎలా జరుపుకోవాలి?
* మీ ఇష్టమైన రుచులతో పాప్‌కార్న్ తయారుచేసి కుటుంబంతో షేర్ చేసుకోండి.
* చాక్లెట్, క్యారమెల్, బటర్, స్పైసీ ఫ్లేవర్స్ తో కొత్త తరహా పాప్‌కార్న్ రుచులను ట్రై చేయండి.
* పాప్‌కార్న్ చరిత్ర గురించి మీ పిల్లలకు చెప్పి వారితో ఈ స్నాక్‌ను ఎంజాయ్ చేయండి.
పాప్‌కార్న్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఇష్టమైన స్నాక్. నేడు నేషనల్ పాప్‌కార్న్ డే సందర్భంగా ఈ రుచికరమైన స్నాక్‌ను అందరూ ఆస్వాదించండి.