Donald Trump: యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానేవచ్చింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు చేపట్టబోతున్నారు. జనవరి 20న అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోని రోటుండా హాల్‌లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి అతిథులు రానున్నారు. అయితే పదవి చేపట్టకు ముందే తన చేష్టలు, ఆయన మద్దతుగా పరివారం చేస్తున్న భజన చూసి అమెరికన్లతోపాటు ప్రపంచంలోని చాలా దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
కానరాని హుందాతనం..
అగ్రరాజ్యం అమెరికా అధినేత అంటే ఎంతో హుందాగా ఉండాలి. తాను భాగుపడుతూ అందరినీ బాగు చేయాలి. అందరితోపాటు ఎదగాలి. కానీ, ట్రంప్ అలాంటి వ్యక్తి కాదు. తాము మాత్రమే బాగుపడాలనుకునే మైండ్‌సెట్. ఆయన నినాదమే మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్. ఇందులో చాలా ద్వేషం నింపి మొదటిసారి అధ్యక్ష ఎన్నిల్లో గెలిచారు. అమెరికన్లకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం అనే ఆచప విధానం. ట్రంప్ అమెరికన్ అయినా.. ఆ దేశ అభివృద్ధిలో వివిధ దేశాల నిపుణుల పనితనం, కృషి ఉంది. అంతెందుకు ఆయన నియమించిన డోజ్ కోచైర్మన్లు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి అమెరికన్లు కాదు. మస్క్ అమెరికా సంపదను భారీగా పెంచాడు. ప్రపంచంలో అగ్రదేశంగా నిలిపాడు. కానీ ఇవేమీ ట్రంప్ పట్టించుకోరు. తన రాజయాల కోసం సొంత దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టారు. మొదటిసారి గెలిచి అమెరికన్లకే ఉద్యోగాలనే నిబంధన అమెలు చేశారు. వీసా రూల్స్ మాచ్చేశారు. ఆయన వల్ల అమెరికాకు నష్టం జరిగిందని భావించిన ఆ దేశ పౌరులు రెండోసారి ఓడించారు. మళ్లీ మూడోసారి పోలీ చేసి గెలిచారు.
మహిళా నేతలపై అనాసక్తి..
అమెరికన్లు మహిళా నేతను అధ్యక్షరాలిగా ఎన్నుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. గతంలో హిల్లరీ క్లింటన్, మొన్న కమలా హ్యారిస్ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ, అమెరికన్లు మగ నేతలకే ఓటేశారు. వీరు వ్యక్తిత్వంలో ట్రంప్ కన్నా చాలా మిన్న. హుందాతనం ఉన్నవారు. అయినా అమెరికన్లు తిరస్కరించారు. బంపర్ మెజారిటీతో గెలిచిన ట్రంప్.. ఇక బాధ్యతలు చేపట్టక ముందే తన ప్రతాపం మొదలు పెట్టారు. ఇక బాధ్యతుల స్వీకరించాక ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్న ఆందోళన అమెరికన్లతోపాటు ప్రపంచ దేశాల్లోనూ నెలకొంది.
కెనడా కలిపేసుకుంటా.. గ్రీన్ లాండ్ కొనేస్తా..
అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించక ముందే ట్రంప్ తన టెంపరితనం ప్రదర్శిస్తున్నారు. కెనడాను అమెరికాలో కలిసేసుకుంటానని ప్రకటించారు. ఇక గ్రీన్‌లాండ్ కొటానని తన సొంత సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇక ఎన్నికల సమయంలో తాను గెలిస్తే యుద్ధాలు ఆపేస్తానని ప్రకటించారు. కానీ, అవేవీ నెరవేరేలా కనిపించడం లేదు. ఆయన తీరుతో కొత్త యుద్ధాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు పుతిన్‌తో భేటీకి ఉవ్విల్లూరుతున్నారు. గతంలో చైనాను అమెరికన్లకు బూచీగా చూపేవారు. గెలిచిన తర్వాత ఎలాంటి ప్రకటన చేయడం లేదు. దీంతో బాద్యతలు చేపట్టాక ఏం చేస్తారో అర్థం కావడం లేదని అమెరికన్లు అంటున్నారు.
ఆయన కారణంగా మూడో ప్రపంచ యుద్ధం?
ఇక ట్రంప్ యుద్ధాలు ఆపకపోగా, కొత్త కయ్యాలు, యద్ధాలు తెచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆయన తీరుతో పలు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందంటున్నారు. ఈ యుద్ధాలు క్రమంగా మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇక హెచ్–1బీ వీసాల విషయంలో, గ్రీన్ కార్డుల జారీ విషయంలో, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేయడంలో ఆయన నిర్ణయాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
వలసదారులపై చిన్నచూపు..
ఇక అమెరికా వలసదారులను ట్రంప్ మొదటి నుంచీ చిన్నచూపు చూస్తున్నారు. అమెరికా సంపదను సృష్టిస్తున్నవారిలో మెజారిటీ వారు విదేశీయులే. అయినా వలసవాదులు అంటే ట్రంప్‌కు చాలా చిన్నచూపు. అందుకే వీసా నిబంధనలు కఠినం చేస్తానని, హెచ్–1బీ వీసాలు తగ్గిస్తానని ఎన్నికల ముందు ప్రకటించారు. అయితే వీసాల జారీని కఠిన తరం చేయడాన్ని మస్క్, వివేక్ రామస్వామి వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచంలోని నిపుణులంతా అమెరికాలోనే ఉండాలన్న స్వార్థం వారిది. అమెరికా అభివృద్ధికే పనిచేయాలన్న ఆలోచన వారిది. కానీ, ట్రంప్ మోనార్క్.. ఎవరి మాట వినడు. తాను ఏది చేయాలనుకుంటున్నాడో అదే చేస్తాడు.
ప్రపంచమంతా ప్రభావం..
అమెరికా అధ్యక్షుడి పాలన ప్రభావం కేవలం అమెరికన్లపైనే కాదు.. ప్రపంచమంతా ఉంటుంది. అమెరికా సాయం, వ్యాపారం, ఆయుధాల కొనుగోలు తదితర కార్యకలాపాల కోసం చాలా దేశాలు ఆధారపడి ఉన్నాయి. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచదేశాలపైనా పడతాయి. ఇప్పటికే సుంకాలు పెంచుతానంటునానడు. అదే జరిగితే చాలా దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతాయి. అమెరికా మాత్రమే లాభపడుతుంది. ఒకవేల ఇతర దేశాలు కూడా అమెరికా ఉత్పత్తులపై సుంఖాలు పెంచితే యుద్ధానికి కూడా దారి తీయొచ్చు. ఇది ప్రపంచానికి అంత మంచిది కాదు. ఈ నేపథ్యంలో నాలుగేళ్లలో ట్రంప్ పాలన ఎలాం ఉంటుంది.. ప్రపంచ గమనం ఏ దిశలో పయనిస్తుంది.. యుద్ధాలు పెరుగతాయా తగ్గుతాయా అన్న టెన్షన్ కనిపిస్తోంది. మొత్తంగా నాలుగేళ్లు ముంచినా తేల్చినా ట్రంపుదే భారం.