Sukumar filmmaking techniques: ‘ఆర్య’ సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన డైరెక్టర్ సుకుమార్…ఈ సినిమాతో ఆయన టాప్ డైరెక్టర్ గా మారాడు. కానీ మధ్యలో కొన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. ఇక రామ్ చరణ్ తో చేసిన ‘రంగస్థలం’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. అప్పటివరకు అలాంటి జానర్ లో ఇలాంటి ఒక సినిమా రాలేదు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను మ్యాజిక్ చేయడం సుకుమార్ కి అలవాటు…మొదటి నుంచి కూడా అతను స్క్రీన్ ప్లే పైన ఎక్కువ వర్క్ చేస్తూ వచ్చాడు. అలాగే తన సినిమాలో క్యారెక్టరైజేషన్స్ సైతం చాలా కొత్తగా ఉంటాయి. డిఫరెంట్ ట్రీట్ మెంట్ తో సినిమాను తీసుకెళ్లడంలో సుకుమార్ ను మించిన వారు మరెవరు లేరనేది వాస్తవం…ఇక తన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన చాలామంది ప్రస్తుతం దర్శకులుగా మారి వాళ్ళ సత్తాను చాటుతున్నారు. నిజానికి ‘ఉప్పెన’ సినిమాతో బుచ్చిబాబు, ‘దసర’ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ఇద్దరు దర్శకులుగా మారి సూపర్ సక్సెస్ లను సాధించారు. మొదటి సినిమాలతోనే భారీ హిట్స్ ను అందుకున్న వీళ్ళు ఆ తదుపరి భారీ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
శ్రీకాంత్ ఓదెల నానితో ‘ప్యారడైజ్’ సినిమా చేస్తుంటే బుచ్చిబాబు మాత్రం రామ్ చరణ్ తో ‘పెద్ది’ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఇక వీళ్లలో ఎవరు పై చేయి సాధిస్తారనేది తెలియాల్సి ఉంది. నిజానికి బుచ్చిబాబు శ్రీకాంత్ ఓదెల ఇద్దరు తీసే సినిమాలు సుకుమార్ రంగస్థలం సినిమాను పోలి ఉంటున్నాయి…
Also Read: తమిళ హీరో విజయ్ తో విడాకులు కోసం కోర్టు మెట్లు ఎక్కిన సంగీత..వీడియో వైరల్!
దసర సినిమా సైతం రంగస్థలం సినిమాను చూసినట్టుగానే అనిపిస్తుంది. ఇక ప్రస్తుతం బుచ్చిబాబు చేస్తున్న పెద్ది సినిమా మీద కూడా రంగస్థలం ప్రభావమైతే ఉంది. సుకుమార్ నడిచిన బాటలోనే అతని శిష్యులు కూడా నడుస్తున్నారు అంటూ కొంతమంది సినిమా మేధావులు కామెంట్స్ చేస్తున్నారు…
సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమాని డిఫరెంట్ జానర్ లో చేస్తారట. ఇప్పటికే కథ మొత్తాన్ని సిద్ధం చేసి పెట్టిన సుకుమార్ తొందరలోనే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ని ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా నుంచి ఒక ఆనిమేటెడ్ వీడియో ను సైతం వదలాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…