Mee Ticket : రాష్ట్ర ప్రజలకు ఎలాంటి టికెట్ కావాలన్నా.. వాటికి సంబంధించిన కౌంటర్లకు వెళ్లాలి. అక్కడ టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రజలు వ్యవయప్రయాసలు పడాల్సి వస్తోంది. అయితే సినిమా టికెట్లు బుకింగ్‌కు ఒక యాప్ ఉంది, రైల్వే, బస్ టికెట్ బుకింగ్‌కు కూడా యాప్‌లు ఉన్నాయి. ఆలయాల దర్శనం కోసం ఆయా ఆలయాలు ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చాయి. కానీ, ఇందుకు వేర్వేరు యాప్స్(Aaps) ఓపెన్ చేయాలి. తెలంగాణ ప్రభుత్వం అన్ని సేవలకు సంబంధించిన టికెట్లు ఒకే చోట పొందడానికి మీ టికెట్ యాప్ తీసుకొచ్చింది. దీంతో కౌంటర్లకు వెళ్లడం, గంటల తరబడి క్యూలో నిల్చునే ఇబ్బందులు, సమయం వృథా(Time wast)కాకుండా ఉండే వీలు కలిగింది. దీనికితోడు చిల్లర సమస్య ఇబ్బందులు కూడా తప్పాయి. ఈ యాప్‌ను తెలంగాణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఇటీవలే ప్రారంభించారు. రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవాలయాల దర్శనం, పూజలు, హైదరాబాద్‌లో మెట్రో రైలు టికెట్లు, పార్కుల దర్శనం టికెట్లు, ఈ యాప్‌లో ఈజీగా పొందవచ్చు. జూపార్కు, బోటింగ్, క్రీడా సౌకర్యాలు, కమ్యూనిటీ హాళ్ల టికెట్లు కూడా అడ్వాన్స్‌గా ఈ యాప్‌లో బుక్ చేసుకోవచ్చు.
సేవలు ఇలా..
యాప్ కావాల్సినవారు స్మార్ట్ ఫోన్‌లో ప్లే స్టోర్ నుంచి మీ టికెట్ యాప్(Me ticket aap)ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ముందుగా మొబైల్ నంబర్, 4 అంకెట పాస్‌వర్డ్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. యాప్‌లో అన్ని రకాల టికెట్ల బుకింగ్‌ను ఒకే ప్లాట్‌ఫాంపై పొందవచ్చు. తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాల(భద్రాచలం, బాసర, యాదగిరిగుట్ట, వేములవాడ వంటి పలు ఆలయాల) పూజల టికెట్లు, 129 పార్కులు, హైదరాబాద్‌లోని మెట్రో(Metro), ఆర్టీసీ(RTC), మ్యూజియంలు, ప్లే, 54 బోటింగ్ ప్రదేశాలు, జూపార్క్, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లకు సంబంధించిన టికెట్లు తీసుకునే వెసులుబాటు కల్పించారు.
అదనపు చార్జీలు లేవు..
ఇక మీ టికెట్ యాప్‌లో ఎలాంటి అదనపు చార్జీలు లేవు. కొన్ని యాప్స్‌లో టికెట్ బుక్ చేసుకుంటే చార్జీలు చెల్లిస్తారు. కానీ, ప్రభుత్వం తెచ్చిన మీ టికెట్ యాప్‌లో టికెట్ తీసుకుంటే ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈజీగా డిజిటల్ టికెట్లు పొందే అవకాశం ఉంది. ఇవేకాకుండా వినియోగదారులు ఎంచుకున్న లొకేషన్‌కు సమీపంలో చూడదగిన ప్రదేశాలు ఉంటే ఆ సమాచారం కూడా యాప్‌లో కనిపించేలా మీ టికెట్ యాప్‌ను అభివృద్ధి చేశారు.