ఏపీలో మద్యం తాగితే మూడేళ్లలో చనిపోయే ప్రమాదం: రఘురామ

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఏపీలోని మద్యం గురించి తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని చిత్రవిచిత్రమైన బ్రాండ్లు ఉన్నాయని…. రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో అమ్ముతున్న మద్యం తాగితే రెండు, మూడేళ్లలో చనిపోయే అవకాశం ఉందని అన్నారు. మద్యం దుకాణాల్లో అమ్ముతున్న మద్యం బ్రాండ్లు అన్నీ ఒకే కంపెనీలో తయారవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో తయారవుతున్న మద్యం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం అని అన్నారు. […]

Written By: Navya, Updated On : August 28, 2020 8:40 pm
Follow us on

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఏపీలోని మద్యం గురించి తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని చిత్రవిచిత్రమైన బ్రాండ్లు ఉన్నాయని…. రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో అమ్ముతున్న మద్యం తాగితే రెండు, మూడేళ్లలో చనిపోయే అవకాశం ఉందని అన్నారు. మద్యం దుకాణాల్లో అమ్ముతున్న మద్యం బ్రాండ్లు అన్నీ ఒకే కంపెనీలో తయారవుతున్నాయని చెప్పారు.

రాష్ట్రంలో తయారవుతున్న మద్యం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం అని అన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పిన వైసీపీ దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లను తీసుకొచ్చి అమ్మడం సరి కాదని వ్యాఖ్యానించారు. ప్రజలు రాష్ట్రంలో దొరికే ఊరూ పేరు లేని బ్రాండ్లను తాగకపోవడమే మంచిదని ఎంపీ సూచించారు. నాసిరకం బ్రాండ్ల మద్యం తాగితే కాలేయ సంబంధిత సమస్యలు ఏర్పడటంతో పాటు ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని చెప్పారు.

రాష్ట్రంలో విచిత్రమైన పేర్లతో మద్యం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయని… ఈ మద్యం ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందో…. వీటి ధరలను ఎవరు నిర్ణయిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఈ మాయదారి మద్యం బ్రాండ్ల గురించి సీఎం జగన్ కు తెలియదని తాను అనుకుంటున్నానని రఘురామ అన్నారు. ప్రభుత్వం బ్రాండ్ల విషయంలో విచారణ జరిపి ప్రజల ఆరోగ్యం కాపాడాలని సూచనలు చేశారు.