పీవీకి మరో అరుదైన గౌరవాన్నిచ్చిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ తన పార్టీ వ్యక్తి కాకపోయినా.. ప్రత్యర్థి పార్టీ నుంచి ప్రధాని అయినా.. తెలంగాణ యోధుడు పీవీ నరసింహారావుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఎంతలా అంటే.. కాంగ్రెస్ కూడా ఈయనను గౌరవించనంత.. కేసీఆర్ కాంగ్రెస్ నేతలను మించి పీవీ నామస్మరణ చేస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. Also Read: సొంత గూటికే డీకే అరుణ? పీవీ నరసింహారావు.. దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన గొప్ప కాంగ్రెస్ ప్రధాని. కానీ సోనియా గాంధీ మాటను […]

Written By: NARESH, Updated On : August 28, 2020 8:32 pm
Follow us on


తెలంగాణ సీఎం కేసీఆర్ తన పార్టీ వ్యక్తి కాకపోయినా.. ప్రత్యర్థి పార్టీ నుంచి ప్రధాని అయినా.. తెలంగాణ యోధుడు పీవీ నరసింహారావుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఎంతలా అంటే.. కాంగ్రెస్ కూడా ఈయనను గౌరవించనంత.. కేసీఆర్ కాంగ్రెస్ నేతలను మించి పీవీ నామస్మరణ చేస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

Also Read: సొంత గూటికే డీకే అరుణ?

పీవీ నరసింహారావు.. దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన గొప్ప కాంగ్రెస్ ప్రధాని. కానీ సోనియా గాంధీ మాటను లెక్కచేయకపోవడంతో కాంగ్రెస్ లో అవమానాలు ఎదుర్కొన్నాడు. కనీసం ఆయన సమాధికి కూడా ఢిల్లీ స్థలం లేకుండా సోనియా అడ్డుకుందనే అపవాదు ఉంది.

అందుకే ఇప్పుడు పీవీ అంటే నచ్చని సోనియాగాంధీని ఎదిరించి తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా పీవీని గట్టిగా స్మరించుకోలేని దుస్థితి. అలాంటి సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ ను ఇరుకునపెట్టేలా కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డుకు ‘పీవీ జ్ఞాన్ మార్గ్’గా పేరు పెడుతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ‘పీవీ’కి భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించడం విశేషం. అలాగే హైదరాబాద్ లో పీవీ మెమోరియల్ నిర్మాణం చేపడుతామని.. పీవీ నరసింహరావు గొప్ప సంస్కర్త అని ప్రపంచం గుర్తించిన తెలంగాణ బిడ్డ అని కేసీఆర్ ప్రశంసించారు.

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీకి పీవీ పేరు.. పీవీ పేరిట అంతర్జాతీయ అవార్డు.. పీవీ విగ్రహాలను ఢిల్లీ తెలంగాణ భవన్ లో పెట్టడం.. ఇలా పీవీని నెత్తిన పెట్టుకున్నాడు కేసీఆర్.

Also Read: ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గెలుపు కష్టమేనా?

కాంగ్రెస్ మరిచినా.. స్మరించుకోని పీవీని కేసీఆర్ ప్రతీసారి స్మరించుకుంటూ కొనియాడుతున్నారు. కొందరేమో.. ఆయన కేసీఆర్ సామాజికవర్గం కాబట్టి ఇలా చేస్తున్నాడని అంటే.. మరికొందరేమో ప్రతిపక్ష కాంగ్రెస్ ను ఇరుకునపెట్టాలని చేస్తున్నాడని అంటారు. మొత్తానికి పీవీతో కేసీఆర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉన్నాడు.

-ఎన్నం