Nagababu : మెగా ఫ్యామిలీ హీరోలు కానీ, మెగా కుటుంబ సభ్యులు కానీ కలిసి ఒకే చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అభిమానులకు చూసేందుకు రెండు కళ్ళు చాలవు అనడంలో అతిశయోక్తి కాదేమో. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో , అలా ఉంటుంది వీళ్ళు మాట్లాడుకుంటే. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా చిరంజీవి అమ్మ అంజనా దేవి(Konidela Anjana Devi) గారితో కలిసి చిరంజీవి, నాగబాబు, చిరంజీవి ఇద్దరు చెల్లెళ్ళు ఒక ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూ లో ఎన్నో విశేషాలను పంచుకున్నారు. అంజనా దేవి తాను చిన్నతనం లో ఉన్నప్పుడు ఎలా కష్టపడిందో, కష్టమైన సమయాల్లో ఆమె ఎలా వ్యవహరించేదో చెప్పుకొని చిరంజీవి బాగా ఎమోషనల్ అయ్యాడు. అదే విధంగా అంజనా దేవి కూడా చిరంజీవి(Megastar Chiranjeevi), నాగబాబు(Konidela Nagababu), పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), అలాగే తన ఇద్దరు కూతుర్లు గురించి ఎన్నో విశేషాలను పంచుకుంది.
Also Read : వర్మ ప్రత్యర్థి జనసేనలోకి.. అలా షాక్ ఇచ్చిన పవన్!
చిన్నప్పుడు ఇంట్లో ఎక్కువగా పనులు చేసేది ఎవరు, తక్కువ పనులు చేసేది ఎవరు? అని యాంకర్ అంజనా దేవి ని అడగగా, దానికి ఆమె సమాధానం చెప్తూ ‘మా పెద్ద కొడుకే అన్ని పనులు చేసేవాడు. నాగబాబు అసలు ఏ పని చేసేవాడు కాదు’ అంటూ చెప్పుకొచ్చింది. అప్పుడు చిరంజీవి మాట్లాడుతూ ‘అలా ఏమి లేదులే అమ్మా..వాడు కూడా గొడ్డు లాగా పనిచేసేవాడు’ అని అంటాడు. అప్పుడు నాగబాబు మాట్లాడుతూ ‘అన్నయ్య అబద్దం చెప్తున్నాడు. నన్ను కవర్ చేయడానికి, కానీ మా అమ్మ చెప్పింది నిజమే. నేను ఇంట్లో ఏ పని చేసేవాడిని కాదు. అన్ని మా అన్నయ్యే చూసుకునేవాడు. కష్టపడి పని చేసొచ్చి, ఏదైనా చిన్న పని నాకు అన్నయ్య చెప్తే, అది కూడా నువ్వే చెయ్యి అనేవాడిని నేను. ఆ విషయంలో ఒకరోజు అన్నయ్య కి కోపం వచ్చి నన్ను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చేవాడు.
ఎవరు ఇంట్లో బాగా తింటారు అని అడిగిన ప్రశ్నకు నాగబాబు సమాధానం చెప్తూ ‘మా 5 మంది పిల్లల్లో మా అమ్మకి పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువ ఇష్టం. చిన్నప్పుడు నేను ఇంట్లో నాకు ఇష్టంలేని వంట వండితే పెద్ద గొడవ చేసేవాడిని. కానీ కళ్యాణ్ బాబు అలాంటి వాడు కాదు. వాడికి ఇష్టం లేని కూర చేస్తే సైలెంట్ గా తినకుండా లేచి వెళ్ళిపోతాడు. ఏమైందిరా అని అడిగితే మళ్ళీ తింటాను లే అమ్మా అనేవాడు. చిన్నప్పుడు వాడు బాగా తక్కువ తినడం వల్ల వీక్ గా ఉండేవాడు, అందుకే మా అమ్మ వాడిపై ఎక్కువ ద్రుష్టి పెట్టేది. వాడికి అమ్మ చేతితో చేసిన పులావు అంటే చాలా ఇష్టం. ఇక మా అన్నయ్య అది కావాలి, ఇది కావాలి అని మారం చేసేవాడు కాదు, ఇంట్లో ఏది వండితే అది తిని వెళ్ళేవాడు’ అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు.
Also Read : నాగబాబు ఎమ్మెల్సీ.. కూటమి ఎట్టకేలకు ఫిక్స్!
మా ఐదుగురిలో పవన్ కళ్యాణ్ అంటేనే అమ్మకు ఎక్కువ ఇష్టం : నాగబాబు
చిన్నప్పుడు కళ్యాణ్ బాబు పెద్దగా ఏమీ తినేవాడు కాదు
వాడికి నచ్చితేనే తింటాడు నచ్చకపోతే సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు
కళ్యాణ్ బాబు చాలా వీక్ గా ఉండేవాడు అందుకే అమ్మ వాడిపై ఎక్కువ శ్రద్ధ పెట్టేది
అన్నయ్య అయితే… pic.twitter.com/MQXb5o4HfX
— BIG TV Breaking News (@bigtvtelugu) March 8, 2025