https://oktelugu.com/

మోదీ ఆలోచన.. కేసీఆర్ ఆచరణ

కొన్ని విషయాల్లో మొండిగా వ్యవహరించే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంప్రదాయాలు పాటించే విషయంలో పూర్తి శ్రద్ధ వహిస్తారు. ఎంత ఖర్చయినా సరే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. తెలంగాణలో ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట వేడుకలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 12 నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. ఆగస్టు 15 వరకు ఈ వేడుకలు సాగుతాయి. ఉత్సవాలకు రూ.25కోట్లు తక్షణం విడుదల చేస్తున్నట్లు ప్రకటించేశారు. దేశంలో స్వంతంత్ర్య సంగ్రామంలో తెలంగాణ కీలక పాత్ర పోషించిందని.. […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 9, 2021 / 01:04 PM IST
    Follow us on


    కొన్ని విషయాల్లో మొండిగా వ్యవహరించే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంప్రదాయాలు పాటించే విషయంలో పూర్తి శ్రద్ధ వహిస్తారు. ఎంత ఖర్చయినా సరే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. తెలంగాణలో ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట వేడుకలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 12 నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. ఆగస్టు 15 వరకు ఈ వేడుకలు సాగుతాయి. ఉత్సవాలకు రూ.25కోట్లు తక్షణం విడుదల చేస్తున్నట్లు ప్రకటించేశారు. దేశంలో స్వంతంత్ర్య సంగ్రామంలో తెలంగాణ కీలక పాత్ర పోషించిందని.. ఆ మేరకు 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహంచాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ అంశం కేసీఆర్ సొంతంగా నిర్ణయం తీసుకుందేమీ కాదు..

    Also Read: అదంతా రాజకీయమేనా..? స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేదెలా..

    ఇదీ.. కేంద్ర ప్రభుత్వ ఆలోచన.. ఇటీవల మోదీ నేతృత్వంలో 75 ఏళ్ల స్వతంత్ర్య వేడుకల నిర్వహణపై ఓ కమిటీ చేశారు ఆ కమిటీలో ముఖ్యమంత్రులు.. గవర్నర్లతో పాటు ఇతర రంగాల ప్రముఖులు ఉన్నారు. వీరితో మోదీ వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ పాల్గొన్న తరువాత.. ఫటాఫట్ నిర్ణయాలు ప్రకటించేశారు. వెంటనే పాతికకోట్లు విడుదల చేస్తున్నట్ల ప్రకటించేశారు. ఉత్సవాల కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారు కేవీ. రమణాచారికి బాధ్యతలు అప్పగించేశారు.

    కమిటీ ఇతర సభ్యులను కూడా నియమించారు. ఇందులో భాగంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 75వారాల పాటు దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. 12వ తేదీన ప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొంటారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం వెనుక జాతీయవాదాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే.. ఆలోచనలో కేంద్రం ఉంది. ఆ జాతీయ వాదం బీజేపీ వాదమని.. కేంద్రాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే.. వారిపై దేశ వ్యతిరేకుల ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారని కొంతకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి.

    Also Read: ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులపై కేసీఆర్ ఫైర్

    రాజకీయంగా బీజేపీ వ్యూహం అదే.. దాన్ని వ్యతిరేకించలేని స్థితికి ఇతర పార్టీలు వెళ్లిపోయాయి. ఈ క్రమంలో తెలంగాణలో.. బీజేపీ వ్యూహానికి చెక్ పెట్టేలా బీజేపీ కన్నా తమకేమీ దేశభక్తి తక్కువకాదన్నట్లుగా కేసీఆర్ ఈ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నట్ల తెలస్తోంది. అందుకే.. మోదీ సమీక్ష ముగియగానే.. రంగంలోకి దిగారని పలువురు భావిస్తున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్