ఆ రెండు కార్పొరేష‌న్లపై సర్వత్రా ఉత్కంఠ.. అధికార, ప్రతిపక్షాలకు రెఫరెండం

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానికి సెలక్ట్‌ చేశారు. అక్కడే రాజధాని కోసం పెద్ద ఎత్తున భూములు సేకరించి నిర్మాణాలు సైతం ప్రారంభించారు. ఇక ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ మాత్రం మూడు రాజధానులకు జై కొట్టారు. ఇది జగన్‌ హయాంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. శాస‌న‌రాజ‌ధానిగా అమ‌రావ‌తిని కొన‌సాగిస్తూనే, విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా, క‌ర్నూలును న్యాయ రాజ‌ధానిగా జ‌గ‌న్ ప్రక‌టించింది. ఇందుకు సంబంధించి చ‌ట్ట స‌భ‌ల్లో ఆమోద ముద్ర కూడా వేసింది. Also Read: […]

Written By: Srinivas, Updated On : March 9, 2021 12:56 pm
Follow us on


చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానికి సెలక్ట్‌ చేశారు. అక్కడే రాజధాని కోసం పెద్ద ఎత్తున భూములు సేకరించి నిర్మాణాలు సైతం ప్రారంభించారు. ఇక ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ మాత్రం మూడు రాజధానులకు జై కొట్టారు. ఇది జగన్‌ హయాంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. శాస‌న‌రాజ‌ధానిగా అమ‌రావ‌తిని కొన‌సాగిస్తూనే, విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా, క‌ర్నూలును న్యాయ రాజ‌ధానిగా జ‌గ‌న్ ప్రక‌టించింది. ఇందుకు సంబంధించి చ‌ట్ట స‌భ‌ల్లో ఆమోద ముద్ర కూడా వేసింది.

Also Read: అదంతా రాజకీయమేనా..? స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేదెలా..

ఈ అంశం ఇప్పుడు హైకోర్టు ప‌రిధిలో ఉంది. అయితే.. గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల ముందు అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగిస్తామ‌ని జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి న‌మ్మబ‌లికి, ప్రజ‌ల్ని వంచించార‌ని, కావున ప్రభుత్వాన్ని ర‌ద్దు చేసి మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని టీడీపీ, జ‌న‌సేన త‌దిత‌ర ప్రతిప‌క్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఒక‌వేళ ప్రజాతీర్పు జ‌గ‌న్ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా వ‌స్తే .. ఇక తాము రాజధాని విష‌య‌మై మాట్లాడ‌మ‌ని ప్రక‌టించారు. ప్రతిప‌క్షాల డిమాండ్‌పై అధికార పార్టీ దీటుగా జ‌వాబిచ్చింది. ఎక్కడైనా స‌వాల్ విసిరే వాళ్లు రాజీనామాల‌కు వెళ్తార‌ని, అందుకు విరుద్ధంగా టీడీపీ, ఇత‌ర ప్రతిప‌క్ష పార్టీలు విచిత్ర వాద‌న చేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు.

ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్రచారాన్ని నిర్వహించారు. జ‌గ‌న్ స‌ర్కార్ రాజ‌ధాని వ్యతిరేక నిర్ణయానికి ఓటు వేయాల‌ని పిలుపునిచ్చారు. దీంతో విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో ఫ‌లితాలు రాజ‌ధానికి రెఫ‌రెండంగా మారాయి. ఒక ర‌కంగా చంద్రబాబు రాజ‌ధాని భ‌విష్యత్‌ను త‌న రాజ‌కీయ స్వార్థం కోసం బ‌లి పెట్టార‌నే అభిప్రాయాలు వ్యక్తమ‌వుతున్నాయి.

Also Read: ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులపై కేసీఆర్ ఫైర్

ఇక అమరావ‌తిపై న్యాయ‌స్థానాల్లో విచార‌ణ‌, తీర్పుల అంశాల్ని పక్కన పెడితే, ప్రస్తుతం ప్రజాకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెల‌కుంది. చంద్రబాబు ఆందోళ‌న చెందుతున్నట్టు విజ‌య‌వాడ‌, గుంటూరుల‌లో వైసీపీకి అనుకూల‌మైన తీర్పు వ‌స్తే మాత్రం.. ఇక శాశ్వతంగా రాజ‌ధానికి స‌మాధి క‌ట్టిన‌ట్టే అనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఈ రెండు న‌గ‌రాల్లో ప్రచారంలో భాగంగా చంద్రబాబు జ‌నంపై విరుచుకుప‌డ‌డం చూస్తుంటే, ఆయ‌న ఆందోళ‌నే నిజ‌మ‌య్యేలా ఉంది. అమరావ‌తిపై ప్రజాస్పంద‌న లేక‌పోవ‌డానికి కార‌ణాల‌ను అన్వేషించ‌డానికి బ‌దులు, తిట్ల దండ‌కానికి దిగ‌డం ఆశ్చర్యం క‌లిగిస్తోంది. ఏదిఏమైనా విజ‌య‌వాడ‌, గుంటూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప్రజాతీర్పు త‌ప్పకుండా రాష్ట్ర రాజ‌కీయాలను కీల‌క మ‌లుపు తిప్పనుంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్