ఏపీలో మంత్రికే దిక్కులేకుండా పోయింది. మంత్రి అని తెలిసినా ఒక సీఐ స్థాయి చిన్న పోలీస్ అధికారి అడ్డుకోవడం కలకలం రేపింది. ఇంతకంటే ఘోర అవమానం మరొకటి ఉండదని మంత్రి అప్పలరాజు అలిగి వెళ్లిపోవడం సంచలనమైంది.

సీఎం జగన్ శారదాపీఠం సందర్శన నేపథ్యంలో ఉత్తరాంధ్ర మంత్రి అయిన అప్పలరాజు ఆ పీఠానికి వచ్చారు. లోపలికి వెళ్తుండగా సిఐ అడ్డుకున్నారు. దీంతో షాక్ అవ్వడం మంత్రి వంతైంది.
వెళ్తే మంత్రి లోపలకి వెళ్లాలని ఆయన అనుచరులు అనుమతించేది లేదని సిఐ స్పష్టం చేయడం గమనార్హం.
మంత్రి బ్రతిమలాడుతుంటే సీఐ వినిపించుకోలేదు. దురుసుగా గెట్ వేసి వెళ్తే మంత్రి లోపలకి వెళ్లాలని, లేకుంటే లేదని సిఐ దబాయించడం సంచలనమైంది.
ఎంట్రన్స్ వద్ద మంత్రిని దుర్భషలాడిన సర్కిల్ ఇన్స్ పెక్టర్ తీరు చూసి అధికార వైసీపీ నేతలు, కార్యకర్తలు సైతం ముక్కున వేలేసుకున్నారు.
తనకు క్షమాపణలు చెప్పాలని మంత్రి అప్పలరాజు, అనుచరులు డిమాండ్ చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
సిఐ క్షమాపణలు చెప్పక పోవడంతో అలిగి వెనక్కి వెళ్లిపోయిన మంత్రి సీదిరి అప్పలరాజు. అనంతరం పై అధికారులకు ఫిర్యాదు చేసి ఆ సీఐ పోస్ట్ ఊడగొట్టిస్తానని అన్నట్టు ప్రచారం సాగుతోంది. ఏకంగా మంత్రినే అడ్డుకొని వెనక్కి పంపిన సీఐ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
[…] Also Read: మంత్రి సిదిరి అప్పలరాజుకు శారదా పీఠం… […]