Minister KTR: ‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు..’ ఇది పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలోని పంచ్ డైలాగ్. జీవిత సత్యం కూడా ఇదే.. అధికారం ఉందికదా అని అహంకారం ప్రదర్శించినా.. పెత్తనం చెలాయించినా.. ఓవరాక్షన్ చేసినా మొదటికే మోసం వస్తుంది. ఈ జీవిత సత్యం తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌కు ఆలస్యంగా బోధపడింది. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గడంతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన తనకుడు కేటీఆర్‌కు అహంకారం నెత్తికెక్కిందన్న అభిప్రాయం ఇటు తెలంగాణ ప్రజల్లో అటు విశ్లేషకుల్లో ఉంది. తాము ఏది చెసినా చెల్లుతుంది అన్నట్లు తొమ్మిదేళ్లు పాలన సాగించారు. మీడియా మొత్తాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. తమకు వ్యతిరేకంగా వార్తలు, కథనాలు రాసే పేపర్లు, ఛానెళ్లతోపాటు సోషల్ మీడయిపై కేసులు పెడుతూ, ప్రకటనలు ఇవ్వకుండా వేధిస్తూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల వేళ.. కేటీఆర్ తొక్కని పత్రిక, ఛానెల్ గడప లేదు. చివరకు సోషల్ మీడియా ఛానెళ్లను కూడా ఆశ్రయిస్తున్నారు.
ఉద్యోగాలు భర్తీ చేయకుండా..
నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇది తెలంగాణ ఉద్యమ నినాదం. ఆత్మగౌరవంతోపాటు నీళ్లు, నిధులు, నియామకాలు కోసమే యావత్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కోసం ఉద్యమించింది. ఉద్యమ సమయంలో కేసీఆర్ తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని ప్రకటించారు. దీంతో నాడు విద్యార్థులు, యువకులు స్వచ్ఛందంగా స్వరాష్ట్రం కోసం చదువులు పక్కన పెట్టి పోరాడారు. తెలంగాణ సాధించుకున్నాక కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేశారు. కానీ, గద్దెనెక్కిన కేసీఆర్… తన కుటుంబంలో ఒక్కొకక్కరికీ ఉద్యోగం ఇస్తూ వచ్చారు. ఉద్యమించిన నిరుద్యోగులు, ఉద్యోగులను మర్చిపోయారు. ఐదేళ్లు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండానే పాలన సాగించారు. రెండోసారి అధికారం కోసం నిరుద్యోగులకు భృతి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి విస్మరించారు. పాలన ముగింపు దశకు చేరుకున్న సమయంలో గ్రూప్–1, 2, 3, 4తోపాటు గురుకుల పోస్టులు, టీఆర్టీ నోటిఫికేషన్లు ఇచ్చారు. కానీ పేపర్ లీకేజీలతో గ్రూప్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంతలో ఎలక్షన్ నోటిఫికేసన్ వచ్చింది. నిర్వహించిన పరీక్షలకు రిజల్ట్ ఇవ్వడం లేదు. రిజల్ట్ ఇచ్చిన పోలీస్ ఉద్యోగాలు పోస్టింగ్ ఇవ్వడం లేదు.
రగులుతున్న నిరుద్యోగులు..
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినా పేపర్ టీకేజీలు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, నిర్వహించిన పరీక్షల ఫలితాలు ప్రకటించకపోవడం, ప్రటకించినా ఉద్యోగాలు ఇవ్వకపోవడం వంటి కారణాలతో ఈసారి తెలంగానలో నిరుద్యోగులు, విద్యార్థులు గులాబీ పార్టీపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇదే అంశాన్ని అందిపుచ్చుకున్న కాంగ్రెస్, బీజేపీలు తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగం పోతేనే తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పింఛన్ల కోసం ఆశపడితే మీ పిల్లలు, మనమలు, మనమరాళ్లు ఆగమవుతారని, కేసీఆర్ గెలిస్తే ఉద్యోగాలు రావని, వారి ఉద్యోగం తీసేస్తేనే తెలంగాణలో పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. దీనికి గ్రామీణుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది.
2.39 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రచారం..
ఇదిలా ఉండగా, తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే, సీఎం తనయ కవితన ఎక్కడ సభ పెట్టినా, ఏ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చినా రైతులకు 24 గటల కరెంటు స్తున్నామని అబద్ధం చెబుతున్నట్లుగానే తెలంగాణ సాధించిన తొమ్మిదేళ్లలో 2.39 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతున్నారు. నోటిఫికేషన్లే ఇవ్వకుండా ఉద్యోగాలు ఎలా భర్తీ చేశారో ఎవరికీ అర్థంకావడం లేదు. పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్న వాస్తవం తెలంగాణ సమాజానికి అర్థమవుతోంది. మరోవైపు ఉద్యోగాలు భర్తీ చేస్తే నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిరుద్యోగ రేటు ఇంతగా ఎందుకు పెరుగుతుందన్న ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రవళ్లిక విషయంలోనూ కేటీర్ ఓ ఇంటర్వ్యూలో వాస్తవం తెలుసుకోకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె తల్లి, సోదరుడిని తెలంగాణ భవన్‌కు పిలిపించి అబద్ధం చెప్పించారు. దీని ప్రభావం తెలంగాణలో తీవ్రంగా ఉంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కశాతం నిరుద్యోగుల ఓట్లు కూడా బీఆర్‌ఎస్‌కు పడవని గులాబీ నేతలకు అర్థమైంది.
నిరుద్యోగులతో భేటీ..
నిరుద్యోగులు గులాబీ పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉండడం, ఇదే సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తామో స్పష్టంగా పేర్కొనడం, టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని హామీ ఇవ్వడం, బీజేపీ కూడా మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం గులాబీ పార్టీకి దడ పుట్టించింది. దీంతో ఇన్నాళ్లూ 2 లక్షలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని అహంకారంతో మాట్లాడిన కేటీఆర్‌కు వాస్తవం అర్థమైంది. తత్వం బోధపడింది. దీంతో సోమవారం హైదరాబాద్‌లో కొంతమంది నిరుద్యోగులను పిలిపించుకుని వారితో సమావేశమయ్యారు. వారిని బతిమిలాడుకుంటున్నట్లు.. నిరుద్యోగులను పైన కూర్చోబెట్టి.. తాను చాలా తగ్గాననే సందేశం నిరుద్యోగులకు ఇచ్చేలా వారి కాళ్ల వద్ద కూర్చున్నట్లు ఓ ఫొటో రిలీజ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై వినతిపత్రం స్వీకరిస్తున్నట్లు మరో ఫొటో, వారితో ముచ్చటిస్తున్నట్లు మరికొన్ని ఫొటోలు తీయించుకున్నారు. కొన్ని హామీలు కూడా ఇచ్చారు.
నటనను నమ్ముతారా..
ఇప్పటికే బీఆర్‌ఎస్‌ను నమ్మి రెండుసార్లు నిరుద్యోగులు మోసపోయారు. బీఆర్‌ఎస్ ఈసారి మేనిఫెస్టోలో నిరుద్యోగుల అంశం కనీసం పేర్కొనలేదు. ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని నిరుద్యోగులు భావిస్తున్నారు. అధికారం ఉందని ఇన్నాళ్లూ కనీసం తమను కలవడానికి కూడా ఇష్టపడని కేటీఆర్ ఇప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసం డ్రామాలు ఆడుతున్నారని పేర్కొంటున్నారు. ఎన్ని డొమ్మరిగడ్డలు వేసినా గులాబీ పార్టీను ఓడిస్తామని అంటున్నారు. నోటికేషన్ల జారీలో జాప్యం చేసి.. ఇచ్చి నోటిఫికేషన్ల పరీక్ష పేపర్లు లీక్‌చేసి.. ఉద్యోగాలు అమ్ముకుని.. టీఎస్‌పీఎస్సీతో తనకు సంబంధం లేదని ప్రకటించి.. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అహంకారపూరితంగా మాట్లాడి.. ఇప్పుడు సమావేశం కావడం.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా కేటీఆర్ తీరు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో తగ్గినా.. నెగ్గుతామన్న భరోసా బీఆర్‌ఎస్‌కు లేకుండా పోయింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Minister ktr who chit chatted with the unemployed
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com