Banita Sandhu: బనిత సంధు బంపర్ ఆఫర్ కొట్టేసింది. అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న G 2లో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన జరిగింది. 2018లో విడుదలైన గూఢచారి సూపర్ హిట్. ఈ సినిమాకు సీక్వెల్ గా గూఢచారి 2 తెరకెక్కుతుంది. యంగ్ డైరెక్టర్ వినయ్ కుమార్ ఎస్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. గూఢచారి 2 మూవీలో బనిత సంధు నటించడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
బనిత సంధు తెలుగు ప్రేక్షకులకు ఇంకా పరిచయం కాలేదు. బనిత సంధు వేల్స్ దేశానికి చెందిన మోడల్ అండ్ యాక్ట్రెస్. బ్రిటిష్ ఇండియన్ పేరెంట్స్ కి ఆమె జన్మించారు. నటిగా ఎదగాలనే ఆశతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆమె మొదటి చిత్రం అక్టోబర్. 2018 ఈ చిత్రం విడుదలైంది. బనిత బంధు తమిళ్ అర్జున్ రెడ్డిలో నటించడం విశేషం.
నటుడు విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన ఆదిత్య వర్మ మూవీలో బనిత సంధు హీరోయిన్ గా నటించింది. బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి చిత్రానికి ఇది రీమేక్. తమిళ్ లో మాత్రం ఈ చిత్రం అంతగా ఆడలేదు. దాంతో సౌత్ లో ఆమె ఫేమస్ కాలేదు. ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాలు చేస్తుంది. మదర్ థెరిస్సా అండ్ మీ, డిటెక్టీవ్ షెర్డిల్ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
తాజాగా గూఢచారి 2 చిత్రానికి సైన్ చేసింది. వరుస విజయాలతో జోరు మీదున్న అడివి శేష్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ గూఢచారి 2. స్పై థ్రిల్లర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది గూఢచారి 2 విడుదల కానుంది. బనిత సంధుకి బ్రేక్ వస్తే టాలీవుడ్ ని ఊపేయడం ఖాయం. బనిత సంధు బోల్డ్ ఫోటో షూట్స్ కి పెట్టింది పేరు. ఆమె ఇంస్టాగ్రామ్ ఏడు లక్షలకు పైగా ఫాలో అవుతున్నారు. బనిత సంధు హాట్ ఫోటో షూట్ వైరల్ అవుతున్నాయి..
View this post on Instagram