గుడ్ న్యూస్.. ‘కరోనా వైరస్’ను తగ్గిస్తున్న ఆయింటిమెంట్!

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. అడ్డూఅదుపు లేకుండా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ ను కట్టడి చేయడానికి అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది ఈ వైరస్ బారిన పడి మృతి చెందారు. అయితే తాజాగా ఒక ఆయింట్మెంట్ కరోనా కట్టడిలో మంచి ఫలితాలను సాధిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఏపీటీ టీ3ఎక్స్ పేరుతో విడుదలైన ఈ ఆయింట్మెంట్ ను సొంతంగా ఎవరైనా వాడుకోవచ్చు. ఈ ఆయింట్మెంట్ కు అమెరికా ఎఫ్డీఏ ఆమోదం కూడా లభించడం […]

Written By: Kusuma Aggunna, Updated On : August 22, 2020 4:43 pm
Follow us on

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. అడ్డూఅదుపు లేకుండా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ ను కట్టడి చేయడానికి అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది ఈ వైరస్ బారిన పడి మృతి చెందారు. అయితే తాజాగా ఒక ఆయింట్మెంట్ కరోనా కట్టడిలో మంచి ఫలితాలను సాధిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఏపీటీ టీ3ఎక్స్ పేరుతో విడుదలైన ఈ ఆయింట్మెంట్ ను సొంతంగా ఎవరైనా వాడుకోవచ్చు.

ఈ ఆయింట్మెంట్ కు అమెరికా ఎఫ్డీఏ ఆమోదం కూడా లభించడం గమనార్హం. ఈ ఆయింట్మెంట్ ను వినియోగించిన 30 సెకన్ల తరువాత వైరస్ కనిపించలేదని శాస్త్రవేత్తల ప్రయోగాల్లో తేలింది. డాక్టర్ బ్రియాన్ హ్యూబర్ వైరస్ ముక్కు ద్వారా సోకకుండా తప్పించుకునేందుకు ఆయింట్మెంట్ కచ్చితంగా ఉపయోగపడుతుందని…. ఈ ఆయింట్మెంట్ గొప్ప ఆవిష్కరణ అని చెప్పారు. కరోనాను ఎదుర్కోవడంలో ఈ ఆయింట్మెంట్ ముందువరసలో నిలుస్తుందని చెప్పారు.

ఈ ఆయింట్మెంట్ ను వినియోగించడం చాలా సులభం. ఆరోగ్య సిబ్బంది సహాయం అవసరం లేకుండానే దీనిని వినియోగించవచ్చు. ఇన్ ఫ్లూయెంజా వైరస్, కరోనా వైరస్ లపై ఆయింట్మెంట్ అద్భుతంగా పని చేస్తోంది. వైరస్ విస్తరించే శక్తిని సెకన్ల వ్యవధిలోనే ఆయింట్మెంట్ నిర్వీర్యం చేస్తోంది. ఆయింట్మెంట్ ను ముక్కులోకి పీల్చుకోవడం ద్వారా కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఫంగస్, బ్యాక్టీరియాల నుంచి రక్షణ కోసం కూడా ఈ ఆయింట్మెంట్ ఉపయోగపడుతుంది.