https://oktelugu.com/

ఏపీ సీఎంఆర్ఎఫ్ లో భారీ కుంభకోణం?

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి వినియోగంలో భారీ కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. లెక్కల్లో తేడాలు, లబ్ధిదారులకు అందని సాయంలో పొంతన లేకపోవడంతో ఏసీబీ విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు అధికారులను ప్రశ్నించారు. ఈ రోజు నలభైమంది ఉద్యోగుల్ని గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఇంతమందిని ప్రశ్ణిస్తున్నారంటే ఇందులో భారీ అవినీతి జరిగి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. సీఎంఆర్ఎఫ్ పూర్తిగా సీఎం విచక్షణ మేరకు వినియోగించే నిధి కావడంతో విరాళాలు భారీ స్థాయిలో […]

Written By: , Updated On : June 29, 2021 / 07:54 PM IST
Follow us on

AP Cm Relief Fundఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి వినియోగంలో భారీ కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. లెక్కల్లో తేడాలు, లబ్ధిదారులకు అందని సాయంలో పొంతన లేకపోవడంతో ఏసీబీ విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు అధికారులను ప్రశ్నించారు. ఈ రోజు నలభైమంది ఉద్యోగుల్ని గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.

ఇంతమందిని ప్రశ్ణిస్తున్నారంటే ఇందులో భారీ అవినీతి జరిగి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. సీఎంఆర్ఎఫ్ పూర్తిగా సీఎం విచక్షణ మేరకు వినియోగించే నిధి కావడంతో విరాళాలు భారీ స్థాయిలో వస్తాయి. దీంతో ఇటీవల కాలంలో కరోనా కారణంగా పెద్ద ఎత్తున విరాళాలు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే వైసీపీ నేతలు నియోజకవర్గాల వారీగా దాదాపుగా రూ. కోటి టార్గెట్ పెట్టుకుని చందాలు వసూలు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత వ్యాక్సిన్ల పంపిణీ చేయాలనుకున్నప్పుడు కూడా విరాళాలు సేకరించేందుకు ప్లాన్ వేశారు. ఆరోగ్యశ్రీలో సేవలు పొందలేని రోగాలు, అసాధారణమైన నష్టాల వల్ల రోడ్డున పడిన కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం చేస్తారు.

కొద్ది రోజుల క్రితం సూట్ కేసుల కంపెనీల పేరుతో నకిలీ చెక్కులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.1.10 కోట్ల వరకు కాజేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. ఆధారాలు దొరికినప్పటికి నిందితుల్ని పట్టుకోలేకపోయారని తెలుస్తోంది. ఇప్పుడు అలాంటి స్కాం ఏం జరిగిందో అధికారులు బయటపెట్టే వరకు తెలియదు. దీంతో జరుగుతున్న స్కాం వెనుక ఎవరెవరి హస్తం ఉందో తెలియాల్సి ఉంది.