https://oktelugu.com/

బాలకృష్ణను అలా చూసి అందరూ షాక్ అయ్యారు !

నందమూరి బాలకృష్ణ అంటేనే వైవిధ్యం. బాలయ్యకు కథ అంటే ప్రాణం, పాత్రలోని ప్రత్యేక గెటప్ అంటే బాలయ్యకు విశేష అభిమానం. పైగా, బాలయ్య పనే దైవంగా భావించే వ్యక్తి. అందుకే, బాలయ్యలా అంకిత భావంతో పనిచేసే అతికొద్ది మంది హీరోల్లో బాలయ్య ముందు వరుసలో ఉంటారు. అయితే, ముప్పై ఏళ్ల క్రితం బాలయ్యకు మంచి అందగాడు అనే పేరు ఉండేది. ఎన్టీఆర్‌ లో తేజస్సును పుణికిపుచ్చుకున్న బాలయ్య ఆ రోజుల్లో మోస్ట్ గ్లామరస్ హీరో. కాగా అది […]

Written By:
  • admin
  • , Updated On : June 29, 2021 / 07:56 PM IST
    Follow us on

    నందమూరి బాలకృష్ణ అంటేనే వైవిధ్యం. బాలయ్యకు కథ అంటే ప్రాణం, పాత్రలోని ప్రత్యేక గెటప్ అంటే బాలయ్యకు విశేష అభిమానం. పైగా, బాలయ్య పనే దైవంగా భావించే వ్యక్తి. అందుకే, బాలయ్యలా అంకిత భావంతో పనిచేసే అతికొద్ది మంది హీరోల్లో బాలయ్య ముందు వరుసలో ఉంటారు. అయితే, ముప్పై ఏళ్ల క్రితం బాలయ్యకు మంచి అందగాడు అనే పేరు ఉండేది.

    ఎన్టీఆర్‌ లో తేజస్సును పుణికిపుచ్చుకున్న బాలయ్య ఆ రోజుల్లో మోస్ట్ గ్లామరస్ హీరో. కాగా అది ‘భైరవద్వీపం’ సినిమా షూటింగ్ మొదలవుతున్న రోజులు. ఆ సమయంలో బాలయ్య ఆ జానపద చిత్రాన్ని ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎందుకంటే మాస్‌ హీరోగా రాణిస్తున్న సమయంలో ‘భైరవద్వీపం’ చేయడం పెద్ద రిస్క్ అన్నారు అందరూ.

    అసలు బాలయ్య ఆ కథను ఒప్పుకోవడమే ఒక ఎత్తయితే, అందులో కురూపిగా నటించి మెప్పించడం అంటే అది సాహసమనే చెప్పాలి. బాలకృష్ణ లాంటి మాస్ హీరో కురూపిగా నటించడం అంటే మరో ఏ హీరో ఒప్పుకునే వాడు కాదు. ఇక్కడ ఉంది బాలకృష్ణ కదా. దర్శకుడిని ఒకసారి నమ్మితే చాలు, అతను ఏమి చెప్పినా చేస్తాడు. అలాగే కథ నచ్చితే చాలు, ఆ కథకు ఏది అవసరమైతే అది చేస్తాడు.

    అందుకే, కురూపి గెటప్ కి మేకప్‌ వేయడానికి దాదాపు 2 గంటల సమయం పట్టినా ఓపిగ్గా ఉండి చేయించుకునేవారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక, బాలకృష్ణను కురూపిగా చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే బాలయ్య కురూపిగా కనిపిస్తారని థియేటర్‌ లో సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవరికీ తెలియదు. మొత్తానికి బాలయ్య అందర్నీ షాక్ చేశాడు.