Jagan: చాలా రోజుల తర్వాత జగన్ జనం బాట పడుతున్నారు. అది కూడా క్లిష్ట పరిస్థితుల నడుమ జనంలోకి వెళ్తున్నారు. మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకున్న తర్వాత మొదటిసారి పర్యటిస్తున్నారు. అది కూడా జగన్ మీద వ్యతిరేక నిరసనలు వినిపించిన విశాఖపట్టణానికి వెళ్తున్నారు. జగన్ తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లులో విశాఖను పరిపాలన రాజధానిగా మార్చాలని ఉంది. కానీ ఇప్పుడు ఆ బిల్లులను వెనక్కు తీసుకోవడంతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజా సంఘాలు నిరసనలు కూడా తెలిపాయి.
ఇంకా ఆ వేడి చల్లారకముందే జగన్ పర్యటన సంచలనంగా మారింది. ఇక విశాఖలో ఒకరోజు పర్యటించి పూర్తి వాస్తవ పరిస్థితులు తెలుసుకోనున్నారు జగన్. ఇక ఈ పర్యటనలో భాగంగా ఆయన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇంకొన్నింటికి శంకుస్థాపన చేస్తారు. ఇక జగన్ వెంట డిప్యూటీ సీఎంలు ధర్మాన కృష్ణదాస్, పుష్ప శ్రీవాణితో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ ఇతర ఎమ్మెల్యేలు ఉంటారు. ఇక ఇక్కడే ఓ బహిరంగ సభను కూడా నిర్వహించనున్నారు.
అయితే జగన్ నిర్వహించే బహిరంగ సభ మీద చాలానే ఊహాగానాలు ఉన్నాయి. రాజధాని విషయంలో ఆయన ఏమైనా కామెంట్లు చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఈ కామెంట్లు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక గ్రేటర్ విశాఖలో రూ.1,285 కోట్లతో చేపట్టే కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు జగన్. దీంతో పాటు ఎయిర్‌పోర్ట్ రహదారి అలాగే కోస్టల్ హైవే లాంటి వాటి పనులను ప్రారంభిస్తారు.
Also Read: YCP MPs: ఏపీని ఆదుకోవాలంటున్న ఎంపీలు.. పార్లమెంటులో దీనంగా వేడుకోలు
ఇక వీటితో పాటు నేరెళ్లవలస వరకు రోడ్డు నిర్మాణం లాంటివి జగన్ పర్యటనలో ఉన్నాయి. ఇక దీంతో పాటు బీచ్ ఫ్రంట్ రీడెవలప్‌మెంట్ పనులకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఈ పర్యటన కేవలం డెవలప్ మెంట్ పనుల్లో భాగంగానే జరుగుతున్నా కూడా.. దీని చుట్టూ ఎన్నో రాజకీయ వ్యవహారాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవైపు చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్న సమయంలోనే ఇలా జగన్ కూడా జిల్లాల పర్యటన పెట్టు్కోవడం గమనార్హం.
Also Read: Chandrababu: ఆ అస్త్రాన్ని వాడేసేందుకు చంద్రబాబు రెడీ.. జగన్‌కు చిక్కులు..!