https://oktelugu.com/

OTT revolution: ఓటీటీ విప్లవానికి నాంది.. సినిమా వాళ్లకు ఉపాధి !

OTT revolution: ఓటీటీ అనేది ఒక విప్లవంలా ప్రతి తెలుగు ప్రేక్షకుడి ఫోన్ లోకి, ఇంటిలోకి వెళ్ళిపోయింది. అయితే, పాశ్చాత్య దేశాల్లో ఈ ఓటీటీ విప్లవం అనేది ఎప్పుడో మొదలైంది. అందుకే, ఆ మధ్య కమల్ హాసన్ లాంటి స్టార్ అండ్ సీనియర్ హీరో కూడా ఓటీటీ అనేది ప్రతి ఇంటికి వస్తోంది అంటూ.. తన సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి తెగ ముచ్చట పడ్డాడు. అయితే, ముచ్చట్లు ఎన్ని జరిగినా కమల్ సినిమా మాత్రం […]

Written By:
  • Shiva
  • , Updated On : December 15, 2021 / 05:04 PM IST
    Follow us on

    OTT revolution: ఓటీటీ అనేది ఒక విప్లవంలా ప్రతి తెలుగు ప్రేక్షకుడి ఫోన్ లోకి, ఇంటిలోకి వెళ్ళిపోయింది. అయితే, పాశ్చాత్య దేశాల్లో ఈ ఓటీటీ విప్లవం అనేది ఎప్పుడో మొదలైంది. అందుకే, ఆ మధ్య కమల్ హాసన్ లాంటి స్టార్ అండ్ సీనియర్ హీరో కూడా ఓటీటీ అనేది ప్రతి ఇంటికి వస్తోంది అంటూ.. తన సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి తెగ ముచ్చట పడ్డాడు. అయితే, ముచ్చట్లు ఎన్ని జరిగినా కమల్ సినిమా మాత్రం థియేటర్స్ లోనే కావాల్సి వచ్చింది.

    OTT revolution

    ఇప్పుడు ప్రపంచంలోనే ఘనమైన ఓటీటీ సంస్థలు ఏవి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవి అమోజాన్, నెట్ ఫ్లిక్ష్ లే. ఈ రెండు సంస్థలు ఇండియన్ మార్కెట్ పై బాగా దృష్టి పెట్టి.. భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అసలు ఓటీటీల వల్ల లాభమా ? నష్టమా ? అని నిర్మాతలు ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నారు. చిన్న సినిమా వాళ్లకు ఓటీటీలు కావాలి. అయితే, ఓటీటీ వాళ్లకు మాత్రం పెద్ద సినిమాలే కావాలి.

    అందుకే, ఓటీటీలకు ఆదరణ దక్కాల్సిన స్థాయిలో దక్కట్లేదు. నిజంగా ఓటీటీలు ఒక పెద్ద సినిమా పై పెట్టే పెట్టుబడితో.. పది పదిహేను చిన్న సినిమాలను నిర్మించొచ్చు. అప్పుడే ప్రేక్షకులకు కూడా ఎక్కువ కంటెంట్ అందుబాటులో ఉంటుంది. చక్కగా వాళ్ళు తమ సినిమా అనుభూతిని కావాల్సినంత ఎక్కువగా పొందగలరు.

    Also Read: Balayya: హిట్ రాగానే బాలయ్యకు తన బ్రీడ్ గుర్తుకొచ్చిందా ?

    కాబట్టి.. ఓటీటీ సంస్థలు పెద్దోళ్ళ మీద నుంచి చిన్నాచితకా చిత్రాల పై కూడా మోజు పెంచుకుంటే మంచిది. ఎలాగూ జియో విప్లవంతో మెజార్టీ జనాలకు హై స్పీడ్ ఇంటర్ నెట్ అందుబాటులోకి ఉంది. ప్రతి సామాన్యుడు కూడా తన ఫోన్ లోనే ఓటీటీ యాప్స్ ను ఉంచుకుని చక్కగా తమకు నచ్చిన సినిమాలను నచ్చిన సమయంలో, నచ్చినట్టుగా చూసుకోవచ్చు.

    అందుకే, ఓటీటీ విప్లవానికి నాంది పలికేది ఎప్పటికైనా విభిన్న చిత్రాలు, చిన్న చిత్రాలే. అసలు ఈ కరోనా కష్టకాలంలో ఓటీటీ సంస్థలు మాత్రమే సినిమా వాళ్లకు ఉపాధిని కల్పించాయి. ఓటీటీల వలన సినిమా వాళ్ళు ఎన్నో ప్రయోజనాలు పొందారు. నెలల కొద్ది థియేటర్లు తెరచుకోని సమయంలో కోట్ల రూపాయలు ఇచ్చి ఆ చిత్రాలను కొనుక్కుని ఓటీటీలు వాళ్లకు చాలా సహాయం చేశాయి.

    Also Read: Anchors turned Actress: యాంక‌ర్లుగా చేసి హీరోయిన్లుగా మారిన వారు ఎంద‌రో తెలుసా..?

    Tags