Balayya: హిట్ రాగానే బాలయ్యకు తన బ్రీడ్ గుర్తుకొచ్చిందా ?

Balayya: సూపర్ హిట్ రాగానే మళ్ళీ బాలయ్య బాబుకు తన బ్రీడ్ గుర్తుకు వచ్చినట్టు ఉంది. ఈ రోజు ఉదయం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ బాలయ్య తనలోని ఒకప్పటి కోపాన్ని, ఆవేశాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. అయితే, గతంలో లాగా ఎవరి పై చేయి వేత్తలేదు, అలాగే తోటి హీరోల పై అడ్డమైన కామెంట్స్ చేయలేదు. కానీ, అఖండ సినిమా విజయంతో మిగిలిన హీరోలకు ధైర్యం వచ్చిందట. మరి ఎవరు ఆ మిగిలిన హీరోలు అంటే.. అల్లు […]

Written By: Shiva, Updated On : December 15, 2021 4:55 pm
Follow us on

Balayya: సూపర్ హిట్ రాగానే మళ్ళీ బాలయ్య బాబుకు తన బ్రీడ్ గుర్తుకు వచ్చినట్టు ఉంది. ఈ రోజు ఉదయం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ బాలయ్య తనలోని ఒకప్పటి కోపాన్ని, ఆవేశాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. అయితే, గతంలో లాగా ఎవరి పై చేయి వేత్తలేదు, అలాగే తోటి హీరోల పై అడ్డమైన కామెంట్స్ చేయలేదు. కానీ, అఖండ సినిమా విజయంతో మిగిలిన హీరోలకు ధైర్యం వచ్చిందట.

Balayya

మరి ఎవరు ఆ మిగిలిన హీరోలు అంటే.. అల్లు అర్జున్, నాని, ఆర్ఆర్ఆర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చరణ్, ఎన్టీఆర్ ఇలా సంక్రాంతి రేసులో ఉన్న ప్రభాస్, పవన్ కళ్యాణ్.. మొత్తానికి అందరికీ అఖండ సినిమా విషయం చూసి ధైర్యం వచ్చిందట. ఇదంతా బాలయ్య భావన. ఇక తన కారణంగా ధైర్యం వచ్చింది కాబట్టి.. ఇక అందరూ సినిమాలను విడుదల చేసేందుకు రెడీ అయ్యారట.

మొత్తానికి తన సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీకి మంచి టైం వచ్చేసింది, ప్రేక్షకులకు ఊపు వచ్చేసింది, మేకర్స్ కు భరోసా లభించింది అని బాలయ్య మాటల్లోని భావాలు. అయినా ఇదంతా నిజమే అనుకుందాం. అయినా ఎవరి డప్పు వాళ్ళే కొట్టుకుంటే వినేవాళ్ళకు వినసొంపుగా ఉండదు. ఈ ముక్క బాలయ్యకు ఎప్పటికీ అర్థం అవుతుందో.

Also Read: Pushpa: ‘పుష్ప’తో పని చేయనున్న రాజమౌళి?

అన్నట్టు బాలయ్య బాబు ఏపీలో టిక్కెట్ల విధానం పై మాత్రం ఎలాంటి కామెంట్లు చేయలేదు. అదేమిటి అంటే.. గతంలోనే తాను ఆ అంశం పై చాలా సార్లు మాట్లాడాను అంటూ బాలయ్య, ఇప్పుడు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే, ఈ విషయంలో మాత్రం బాలయ్య, అఖండ టీమ్ మొత్తం బాగా ఫీల్ అవుతుంది.

జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో అఖండ రిలీజ్ కి ముందు రద్దు అయి ఉంటే.. మరో 30 కోట్లు కలెక్షన్స్ వచ్చేవి. కానీ, ఆ అవకాశాన్ని అఖండ కోల్పోయాడు. అయితే, కోర్టు నిర్ణయంపై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్తామంటుంది. కాబట్టి… ఈ జీవో రద్దు అనేది ఇప్పట్లో పోయేలా లేదు. జగన్ మాట అంటే మాటే. మరి భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చూడాలి.

Also Read: ఛ.. వీడేం హీరో ? వద్దులే అండి కృష్ణగారు !

Tags