India vs Pakistan match : టి20 వరల్డ్ కప్ లో టీం ఇండియాతో మ్యాచ్ ఆడేది లేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పేర్కొంది. వాస్తవానికి పాకిస్తాన్ మాట్లాడే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉండదు. ఎందుకంటే పాకిస్తాన్ అనే దేశం మాట మీద నిలబడదు. చివరికి ఆదేశ క్రికెట్ బోర్డు కూడా అలానే వ్యవహరిస్తూ ఉంటుంది.
పాకిస్తాన్ గట్టి ప్రతిజ్ఞ చేసిన నేపథ్యంలో ప్రపంచంలో ఏ దేశం కూడా నమ్మలేదు. ఎందుకంటే పాకిస్తాన్ అనేది చంచల స్వభావమైన దేశం. పైగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు భారత్ ఇచ్చే ఆ పైసలే ఆదాయం. అందువల్లే పాకిస్తాన్ భారత్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే.. ఆ తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పటికే టీమిండియా కెప్టెన్ ఫిబ్రవరి 15న పాకిస్తాన్ జట్టుతో జరిగే మ్యాచ్ కోసం తాము సిద్ధంగా ఉన్నామని.. కొలంబో కూడా వెళ్ళిపోతున్నామని ప్రకటించాడు. ప్రత్యర్థి జట్టు తీసుకునే నిర్ణయం మీద తమకు సంబంధం లేదని.. తమకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే నడుచుకుంటామని సూర్యకుమార్ యాదవ్ ప్రకటించాడు.
ఇప్పుడు తాజాగా జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మనసు మార్చుతుందని.. ఫిబ్రవరి 15న భారత జట్టుతో మ్యాచ్ ఆడుతుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. భారత జట్టుతో జరిగే మ్యాచ్లో పాకిస్తాన్ ఆడాలని శ్రీలంక క్రికెట్ బోర్డు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు లేఖ రాసింది. ఈ మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ జట్టును తప్పించిన నేపథ్యంలో.. ఐసీసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పాకిస్థాన్ భారత జట్టుతో జరిగే మ్యాచ్ లో ఆడబోమని స్పష్టం చేసింది. ఒకానొక దశలో ఈ టోర్నీ నుంచి తప్పుకోవాలని పాకిస్తాన్ భావించింది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మధ్యలో ప్రవేశించి టీమ్ ఇండియాతో ఆడే మ్యాచ్ మాత్రమే రద్దు చేసుకోవాలని సూచించిన నేపథ్యంలో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మనసు మార్చుకుంది. మరోవైపు పాకిస్తాన్ జట్టు ఆడే మ్యాచ్ లు మొత్తం కొలంబో వేదికగా జరుగుతాయి. గత ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తన మ్యాచులు మొత్తం దుబాయ్ వేదికగా ఆడింది. ఆ సమయంలో భారత జట్టుతో పాకిస్తాన్ కూడా దుబాయ్ లోనే తలపడటం విశేషం. తమ దేశంలో ఆడాలని భారత ప్లేయర్లకు అనేక రకాలుగా పాకిస్తాన్ మాజీ ప్లేయర్లు.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెప్పినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
