ప్రజాస్వామ్య మూలస్తంభమైన ఎన్నికలను .. అదే ఎన్నిక ద్వారా ఏర్పాటయిన ప్రభుత్వం సవాలు చేస్తోంది. ఒక రకంగా ప్రభుత్వం.. రాజ్యంగం మధ్య ఆంధ్రప్రదేశ్ వేదికగా పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇందులో విజయం ఎవరిది..? ఎవరు వెనక బడతారు అనే అంశంపై భారత ప్రజాస్వామ్య తదుపరి నడక ఉంటుందనడంలో ఎలాంటి సందేశం లేదు. సీఈసీ అధికారాలన్నీ ఎస్ఈసీకి ఉంటాయన్న హైకోర్టు తీర్పు ఇప్పడు ఏపీలో కీలక అంశంగా మారింది. అంత స్పష్టంగా తీర్పు ఇచ్చినప్పడు దాన్ని ధిక్కరించే అధికారాలు ఎవరికీ ఉండవు.
Also Read: నిమ్మగడ్డకు షాక్: పంచాయితీకి నై.. ఏపీ ఉద్యోగుల తిరుగుబాటు
అఖిలభారత సర్వీసుల అధికారులు… వీరిలో ప్రతీ అధికారి ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. షెడ్యూల్ విడుదల అయిన తరువాత అందరూ ఎవరి ఆధీనంలో పనిచేయాలో కూడా వారికి తెలుసు. అయనా ఎస్ఈసీ అధికారాన్ని ధిక్కరించి.. తాము ఆయన చెప్పినట్టు చేయబోమని చెప్పడమే కాదు.. నోటిఫికేషన్ ఇచ్చినా సరే.. తమకేమీ సంబంధం లేదంటున్నారు. అంటే ఇదీ కచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనే. ఎస్ఈసీని ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకుంటే ఇక రాజ్యాంగ నిర్వీర్యమే. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదంటూ.. ప్రజాస్వామ్య మూలస్తంభాన్ని కూలదోస్తున్నట్టే..
రేపు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించమని ప్రకటిస్తే.. పరిస్థితి ఏమిటి..? ఎన్నికలు లేకుండా భారత ప్రజాస్వామ్యం ముందుకు సాగుతుందా..? రాజ్యాంగ విధి ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిందే. దానికి ప్రభుత్వాలు కూడా అతీతం కాదు. రాజ్యాంగ విధి ప్రకారం.. ఈఎన్సీ అయినా.. ఎస్ఈసీ అయినా.. ఎన్నికలు పెడతారు.
Also Read: ఏ1 చంద్రబాబు.. ఏ2 అచ్చెన్నాయుడు.. బుక్కైనట్టేనా?
అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రాజ్యాంగాన్ని ధిక్కరిస్తోంది. రాజ్యాంగాన్ని బలహీనం చేస్తున్న సివిల్ సర్వీసు అధికారుల విధేయత, రాజ్యాంగంతో యుద్ధానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఉన్నతాధికారులను ముందు పెట్టి పోరుకు సై అంటోంది. కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇది రిస్క్ తో కూడిన వ్యవహారమని చెప్పినప్పటికీ. జగన్ సర్కారు మొండిగా వ్యవహరిస్తోంది. ఎస్ఈసిని ఎదురించిన అధికారులకు భవిష్యత్ లో ఏపీ ప్రభుత్వం ఉన్నతమైన పదవులు అప్పగించవచ్చు. అంతే కాకుండా కీలక పోస్టుల్లో వారిని కూర్చుండబెట్టవచ్చు. అయితే త్వరలో రిటైర్మెంట్ కాబోతున్న నిమ్మగడ్డ రమేశ్ బాబుకు అనుకూలంగా ఉండే బదులు వచ్చే మూడేళ్లు సర్కారును నడిపే… జగన్ ప్రభుత్వానికే మద్దతు ఇస్తే.. తమకూ మేలని ఏపీలోని చాలా మంది ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్