Homeఆంధ్రప్రదేశ్‌Kodali Nani: కొడాలి నాని ఎందుకంత సైలెంట్ అయ్యాడు? ఏం కష్టమొచ్చింది?

Kodali Nani: కొడాలి నాని ఎందుకంత సైలెంట్ అయ్యాడు? ఏం కష్టమొచ్చింది?

Kodali NaniKodali Nani: వైసీపీ ప్రభుత్వం లో కొడాలి నాని మంత్రిగా కొనసాగుతున్నారు. గుడివాడ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన చివరిసారిగా మంత్రి అయ్యారు. ఆయన ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వం వేరే ఉండేది. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. 2009లో మరోసారి టీడీపీ నుంచి విజయం సాధించినా కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో ఏమి చేయలేకపోయారు. దీంతో ఆయన కూడా ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పేవారు. కానీ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండడంతో తప్పించుకోవడానికి వీలు లేకుండా పోతోంది. అప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నానని తప్పించుకున్నారు. కానీ ఇప్పుడు ఎలా తప్పించుకుంటారు.

గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అభివృద్ధి విషయంలో కొడాలి నాని పట్టించుకుంటారని భావించారు. కానీ వారి ఆశలు మాత్రం తీరడం లేదు. వైసీపీ జెండా ఎగరడంలో కీలక పాత్ర పోషించిన ఓటర్లు మాత్రం నిరాశగా ఉన్నారు. కొడాలి నాని తనను గెలిపించిన ఓటర్ల రుణం తీర్చుకునే పనిలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు. దీంతో నియోజకవర్గ అభివృద్ధి ఆమడ దూరంలో నిలిచిపోతోంది. ఒక్క పని కూడా కావడం లేదు. రోడ్లన్ని అధ్వానంగా మారాయి.

కొడాలి నాని నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. జగన్ కేబినెట్ లో నోరున్న నేతగా ముద్ర పడిపోయారు. ప్రతిపక్షాలను తిట్టడంలో ఆయనదే పైచేయి. బూతు మాటలు మాట్లాడటంలో ఆయనను మించిన వారు ఎవరు లేరని తెలుస్తోంది. కానీ గుడివాడ అభివృద్ధి మాత్రం దేవుడెరుగు అనే విధంగా మారింది. విజయవాడ-గుడివాడ, గుడివాడ-హనుమాన్ జంక్షన్ రహదారుల పరిస్థితి దారుణంగా మారాయి.

గుడివాడ ప్రజలు గుర్తుంచుకునేలా ఏ ఒక్క పని కూడా చేయలేదు. దీంతో ప్రజలు నానిపై గుర్రుగానే ఉన్నట్లు తెలుస్లోంది. ఇరవై ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటున్నా పనులు మాత్రం చేయడం లేదు. బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధిస్తున్నా ఆయన తన పనితనం మాత్రం మార్చుకోవడం లేదు. ప్రజల కోసం పనులు చేయాలన్న కనీస ధర్మం కూడా చూపడం లేదు. ఎప్పుడు చూసిన చంద్రబాబును తిట్టడానికే సమయం సరిపోతుందని చెబుతున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్న పనిలో మాత్రం శ్రద్ధ కనిపించడం లేదు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Telangana Employee Health Scheme

Telangana Employee Health Scheme: తెలంగాణ ఉద్యోగులు గుడ్‌ న్యూస్‌.. 40 ఏళ్లు దాటితే ఫ్రీ హెల్త్‌ చెకప్‌!

Telangana Employee Health Scheme: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారి సంక్షేమం కోసం ‘నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం’ (ఎన్‌ఈహెచ్‌ఎస్‌) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం...
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: ఆ హీరోయిన్స్ కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దమైన ‘బిగ్ బాస్ 10’ టీం.....

Bigg Boss 10 Telugu: గత బిగ్ బాస్ సీజన్ అందరి అంచనాలను దాటి , కనీవినీ ఎరుగని రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , రికార్డు...
Toxic Movie

Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా!

Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'టాక్సిక్' వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన...
Nagarjuna

Nagarjuna: ‘లెనిన్’ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాము అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్...
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...
Oktelugu Epaper