Kishan Reddy- Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. బీజేపీ జనసేన పొత్తులో ఉన్నా అవి ఎక్కడ కూడా బహిరంగ వేదికల్లో కలుసుకోవడం లేదు. ఫలితంగా అందరికి అనుమానాలు వస్తున్నాయి. నిజానికి రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుని కలిసి వెళ్లింది లేదు. ఏ కార్యక్రమం చేపట్టినా రెండు పార్టీలు ఎడమొహం పెడమొహంగానే ఉండటం తెలిసిందే. దీంతో రెండు పార్టీల్లో సఖ్యత ఉందా? అవి భాగస్వామ్య పార్టీలేనా అనే సందేహాలు ప్రజలకు రావడం సహజమే. దీనిపై పార్టీలే స్పష్టత ఇవ్వడం లేదు. గతంలో జరిగిన తిరుపతి ఉప ఎన్నికలో సైతం రెండు పార్టీలు కలిసి ప్రచారం చేయలేదు.
దీంతో ఇటీవల ప్రధాని భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125 జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. భాగస్వామ్య పార్టీ అయిన జనసేన తరఫు నుంచి పవన్ కల్యాణ్ అయినా ఇంకా ఎవరైనా నేత రావాల్సింది. కానీ ఎవరు రాలేదు. దీంతో జనసేన వైఖరి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. మిత్రపక్షమైనా ప్రధాని సభకు హాజరు కాకపోవడంపై అందరిలో సందేహాలు వస్తున్నాయి. బీజేపీ జనసేన మధ్య దూరం పెరుగుతుందా? పవన్ కల్యాణ్ బీజేపీకి దూరం కానున్నారా? అనే కోణంలో ఆలోచిస్తున్నారు.
Also Read: Electric Vehicles: ‘ఈ’-బండి జోరు పెరుగుతోంది
పవన్ కల్యాణ్ రాకపోవడానికి కారణాలు వేరే ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని కార్యక్రమం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుండటంతో సీఎం జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని ఏర్పాట్లు చేశారు. దీంతో ఆ సభలో పాల్గొంటే జగన్ తో కలిసి పనిచేసినట్లే అనే వాదన వస్తుందనే ఉద్దేశంతో పవన్ సభకు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. మరోవైపు సభకు హాజరైతే వేదిక మీద పవన్ కల్యాణ్ ఉంటే కింద అన్నయ్య ఉండాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే తాను సభకు రాలేదని పవన్ అభిప్రాయపడినట్లు సమాచారం.
ప్రధాని సభకు రావాల్సిందిగా స్వయంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి ఆహ్వానం పలికినట్లు తెలిసిందే. కానీ అనివార్య కారణాల వల్ల తాను సభకు హాజరు కాకపోయినట్లు పవన్ వెల్లడించారు. దీంతో రెండు పార్టీల వ్యవహారంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకదశలో జనసేన టీడీపీతో పొత్తుకు ద్వారాలు తెరిచిందని పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన కూడా ఎటువైపు వెళ్తుందో తెలియడం లేదు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం తనకు బీజేపీలో పరిచయాలు ఉన్నాయని అందుకే దాంతోనే పోటీలో ఉంటామని చెబుతున్నా చివరకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని నేతలు చెబుతున్నారు.
Also Read:Rajyasabha: నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచి నలుగురు.. రాజమౌళి తండ్రికి రాజ్యసభ ఇచ్చిన మోడీ