రైతుల కోసం మోడీతో ఢీకొంటున్న కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల కోసం కేంద్రంలోని మోడీ సర్కార్ తో ఢీకొంటున్నారు. ఈ మేరకు తమ పార్టీ ఎంపీలకు తాజాగా దిశానిర్ధేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లు తేనె పూసిన కత్తిలాంటి చట్టమని.. దీన్ని పార్లమెంట్ లో వ్యతిరేకించాలంటూ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. Also Read: తలసాని డ్యామేజీ.. కేసీఆర్ సీరియస్ […]

Written By: NARESH, Updated On : September 19, 2020 3:59 pm

kcr modi

Follow us on

తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల కోసం కేంద్రంలోని మోడీ సర్కార్ తో ఢీకొంటున్నారు. ఈ మేరకు తమ పార్టీ ఎంపీలకు తాజాగా దిశానిర్ధేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లు తేనె పూసిన కత్తిలాంటి చట్టమని.. దీన్ని పార్లమెంట్ లో వ్యతిరేకించాలంటూ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Also Read: తలసాని డ్యామేజీ.. కేసీఆర్ సీరియస్ అయ్యారా?

రైతులను దెబ్బతీసి కార్పొరేట్ వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉన్న బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు కే కేశవరావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. పైకి చెప్పడానికి రైతులు తమ సరుకును ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్పారని.. కానీ వాస్తవానికి వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరుకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడే విధానం బిల్లులో ఉందని కేసీఆర్ ఆరోపించారు.

కార్పొరేట్ గద్దులు దేశమంతా విస్తరించడానికి.. ప్రైవేటు వ్యాపారులకు దారులు బార్లా చేయడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందని విమర్శించారు.రైతులు ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అమ్మడం సాధ్యమేనా? ఇది ఖచ్చితంగా వ్యాపారులకు లాభం చేకూర్చేదే అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు.

దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ వేళ.. దేశవ్యాప్తంగా మొక్కజొన్న పంట భారీగా పండుతున్న వేళ కేంద్రం మొక్కజొన్నలపై 35శాతం సుంకం తగ్గించి కోటి టన్నులు ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారని మోడీ సర్కార్ ను కేసీఆర్ ప్రశ్నించారు.

Also Read: సొమ్ము స్వాహా: రైతుల కంట్లో సహ‘కారం’

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుతో రైతులకు తీవ్ర నష్టమని.. దీనిని గట్టిగా వ్యతిరేకించాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు సూచించారు.ఈ బిల్లుకు వత్యిరేకంగా ఓటువేయాలని ఎంపీలను ఆదేశించారు.

దీంతో రైతుల సంక్షేమం విషయంలో తాను మోడీని సైతం ఎదురిస్తానని ఈ పరిణామంతో కేసీఆర్ స్పష్టం చేసినట్టైంది. మరి పక్కనున్న రైతు పక్షపాతినంటున్న సీఎం జగన్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది వేచిచూడాలి.