తలసాని డ్యామేజీ.. కేసీఆర్ సీరియస్ అయ్యారా?

అంతన్నాడు.. ఇంతన్నాడు.. చివరికి తెలంగాణ మంత్రి తలసాని ముంతమామిడి ముంత అన్నాడు అని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క సెటైర్లు వేశారు. కేసీఆర్ హామీనిచ్చిన లక్ష ఇళ్లు ఏవీ అంటే హైదరాబాద్  శివారున ఉన్న 3500 ఇళ్లు మాత్రమే చూపించాడని భట్టి ఎద్దేవా చేశారు. మంత్రి తలసాని అనవసరంగా భట్టి సవాల్ ను స్వీకరించి అభాసుపాలయ్యాడా అన్న చర్చ ఇప్పుడు గులాబీ పార్టీ వర్గాల్లో సాగుతోంది. Also Read: రైతుల కోసం మోడీతో ఢీకొంటున్న కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా […]

Written By: NARESH, Updated On : September 19, 2020 3:59 pm

talasani

Follow us on

అంతన్నాడు.. ఇంతన్నాడు.. చివరికి తెలంగాణ మంత్రి తలసాని ముంతమామిడి ముంత అన్నాడు అని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క సెటైర్లు వేశారు. కేసీఆర్ హామీనిచ్చిన లక్ష ఇళ్లు ఏవీ అంటే హైదరాబాద్  శివారున ఉన్న 3500 ఇళ్లు మాత్రమే చూపించాడని భట్టి ఎద్దేవా చేశారు. మంత్రి తలసాని అనవసరంగా భట్టి సవాల్ ను స్వీకరించి అభాసుపాలయ్యాడా అన్న చర్చ ఇప్పుడు గులాబీ పార్టీ వర్గాల్లో సాగుతోంది.

Also Read: రైతుల కోసం మోడీతో ఢీకొంటున్న కేసీఆర్

అసెంబ్లీ సాక్షిగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లపై కాంగ్రెస్‌ సవాల్‌ చేయడం.. వాటిని టీఆర్‌‌ఎస్‌ స్వీకరించడం అందరికీ తెలిసిందే.. మహానగరంలో లక్ష ఇండ్లు నిర్మించామని కేసీఆర్ అన్నారని.. వాటిని చూపించండి అంటూ సీఎల్పీ లీడర్‌‌ భట్టి విక్రమార్క కోరడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. దీంతో భట్టి సవాల్ ను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్వీకరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

భట్టి సవాల్‌ను స్వీకరించిన తలసాని శ్రీనివాస్‌.. ఆయనతోపాటు కాంగ్రెస్‌ ముఖ్యనేతలకు డబుల్‌ బెడ్‌రూంలు చూపించేందుకు డిసైడ్‌ అయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మూడు నాలుగు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను చూపించాడు. ఎక్కడో నగరానికి దూరాన నిర్మించిన డబుల్‌ బెడ్‌రూంలు చూపించారని కాంగ్రెస్ నేత భట్టి విమర్శించాడు. మహానగరంలో నిర్మించినవి చూపించమంటే.. ఎక్కడో నిర్మించనవి చూపిస్తున్నారంటూ కాంగ్రెస్‌ నేతలు తలసానిని నిలదీయగా.. మంత్రి మధ్యలోనే వెళ్లిపోయారు.

రెండు రోజుల పర్యటనలో జీహెచ్‌ఎంసీ పేదలకు ఇచ్చే కేవలం 3,428 ఇళ్లను మాత్రమే చూపించగలిగారు. లక్ష ఇండ్ల మాటలను కప్పిపుచ్చుకునేందుకే ఆయన జీహెచ్‌ఎంసీ వెలుపల నిర్మాణంలో ఉన్న గృహ సముదాయాలను చూపించడానికి ప్రయత్నించాడని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తుక్కుగుడ ప్రాంతంలోని మంఖల్‌కు తీసుకెళ్లి అక్కడి ఇళ్లను చూపారు.

మొత్తం కలిపినా 3500 ఇళ్లు కూడా కట్టలేదని.. కేసీఆర్ చెప్పిన  లక్ష ఇళ్లను లెక్కించాలంటూ భట్టి సవాల్ చేయడంతో ప్రభుత్వం ఇరుకునపడింది.. దీనికి కౌంటర్ ఇచ్చిన మంత్రి తలసాని.. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్ లో స్థలాలు లేకుండా చేశారని.. ప్రతిపక్షాలు ఖాళీ స్థలాలను చూపిస్తే ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తుందని చెప్పుకొచ్చారు.

Also Read: సొమ్ము స్వాహా: రైతుల కంట్లో సహ‘కారం’

మంత్రి తలసాని ప్రకటనతో ప్రభుత్వం డొల్లతనం అంతా కూడా  బయటపడినట్లైంది. ఎంతో గొప్పగా సవాల్‌ను స్వీకరించిన తలసాని కనీసం 10 వేల ఇండ్లను కూడా చూపకపోవడం గమనార్హం. ఈ పరిణామం టీఆర్‌‌ఎస్‌ గవర్నమెంట్‌కు కోలుకోని దెబ్బగా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఈ వ్యవహారాన్నిటీఆర్‌‌ఎస్‌ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుందని తెలిసింది.  తలసాని వ్యవహరించిన తీరుతో పార్టీకి నష్టం కలిగిందని భావిస్తోందట. మున్ముందు మహానగరంలో ఎలక్షన్లు రాబోతున్నాయి.. ఇప్పుడు ఇలా పార్టీకి డ్యామేజీ జరగడంపై అధినేత కేసీఆర్ ఫైర్‌‌ అవుతున్నట్లు సమాచారం.