వస్తే ఓటీటీలో.. లేదంటే పెద్ద సినిమాలన్నీ సంక్రాంతికేనట?

కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లన్నీ మూతపడగా.. షూటింగులు వాయిదాపడ్డాయి. టాలీవుడ్లో సినిమా షూటింగులన్నీ ఇప్పుడిప్పుడే మొదలవుతోన్నాయి. అయితే గత ఆరునెలలుగా థియేటర్లు పడటంతో ఆ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికీ కూడా థియేటర్ల ఓపెనింగ్ పై క్లారిటీ రావడం లేదు. దీంతో థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులంతా ఓటీటీ, వెబ్ సీరిసులకు అలవాటు పడిపోతున్నారు. అయితే థియేటర్లు ఓపెన్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందనే ఆసక్తికరంగా మారింది. Also Read: వైరల్ అవుతోన్న ‘రమ్యకృష్ణ -సత్యరాజ్’ […]

Written By: NARESH, Updated On : September 19, 2020 6:28 pm

cinema theaters

Follow us on


కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లన్నీ మూతపడగా.. షూటింగులు వాయిదాపడ్డాయి. టాలీవుడ్లో సినిమా షూటింగులన్నీ ఇప్పుడిప్పుడే మొదలవుతోన్నాయి. అయితే గత ఆరునెలలుగా థియేటర్లు పడటంతో ఆ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికీ కూడా థియేటర్ల ఓపెనింగ్ పై క్లారిటీ రావడం లేదు. దీంతో థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులంతా ఓటీటీ, వెబ్ సీరిసులకు అలవాటు పడిపోతున్నారు. అయితే థియేటర్లు ఓపెన్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందనే ఆసక్తికరంగా మారింది.

Also Read: వైరల్ అవుతోన్న ‘రమ్యకృష్ణ -సత్యరాజ్’ వీడియో !

చిన్న సినిమాలకు ఓటీటీలు వరంగా మారుతుండగా పెద్ద సినిమాల పరిస్థితి ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి. భారీ బడ్జెట్లో నిర్మించే ఈ సినిమాలకు ఓటీటీలు అంత భారీ ధర ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో నిర్మాతలు థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. ఇప్పటికే చాలారోజులు థియేటర్లు మూతపడటంతో వడ్డీల భారం పెరుగుతుండటంతో కొందరు నిర్మాతలు ఓటీటీల్లో వచ్చిన ధరకు సినిమాలను అమ్మేసుకుంటున్నారు.

అయితే బడా నిర్మాతలు మాత్రం తమ సినిమాలను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయినా ప్రేక్షకుల వస్తారా? అన్న సందేహాలు ప్రతీఒక్కరిలో నెలకొని ఉన్నారు. దీంతో పెద్ద సినిమా నిర్మాతలు తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. సంక్రాంతి నాటికి పరిస్థితులన్నీ చక్కబడే పరిస్థితులు కన్పిస్తుంది. దీంతో బడా నిర్మాతలంతా తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేసుకుంటున్నారు.

Also Read: ప్లాప్ హీరోకి బంపర్ ఆఫర్ !

ఇప్పటికే దాదాపు 80శాతం పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ కూడా సంక్రాంతి రేసులో ఉన్నట్లు టాక్ విన్పిస్తోంది. యశ్ హీరోగా నటిస్తున్న కేజీఎఫ్-2.. రామ్ పోతినేని ‘రెడ్’.. నితిన్ ‘రంగ్ దే’.. అఖిల్ ‘మోస్ట్ ఎలిబిబుల్ బ్యాచిలర్’.. నాగచైతన్య ‘లవ్ స్టోరీ’.. రవితేజ ‘క్రాక్’ సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్.. రంగ్ దే మూవీలకు ఓటీటీలు ఫ్యాన్సీ ధరను ఆఫర్ చేసినా నిర్మాతలు మాత్రం థియేటర్లలోనే సినిమాలను రిలీజ్ చేసేందుకు మొగ్గుచూపుతున్నారట. ‘ఆచార్య’ కూడా సంక్రాంతి రేసులో ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈసారి సంక్రాంతికి థియేటర్లన్నీ కొత్త సినిమాలతో కళకళలాడటం ఖాయంగా కన్పిస్తున్నాయి.