https://oktelugu.com/

జగన్ పై మళ్లీ ఊడిపడ్డ కేఏ పాల్

కేఏ పాల్.. ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా? అన్నట్టుగా పోకిరీ సినిమాలోని డైలాగ్ లాగే.. కేఏ పాల్ ఏపీలోకి ‘ఎప్పుడొస్తాడో తెలియదు.. కానీ సిరయస్ విషయాల్లో తలదూర్తి రచ్చ రచ్చ చేస్తుంటాడు’. మీడియా అటెన్షన్ మొత్తం తనవైపుకు తిప్పుకుంటాడు. కేఏ పాల్ వెనుకాల చంద్రబాబు ఉన్నారని.. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడే పిలిపిస్తారనే టాక్ కూడా ఉంది. ఇప్పుడు జగన్ ను.. విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకునే కేఏ పాల్ వచ్చారని ప్రచారం సాగుతోంది. ప్రజాశాంతి పార్టీ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 29, 2021 / 06:07 PM IST
    Follow us on

    కేఏ పాల్.. ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా? అన్నట్టుగా పోకిరీ సినిమాలోని డైలాగ్ లాగే.. కేఏ పాల్ ఏపీలోకి ‘ఎప్పుడొస్తాడో తెలియదు.. కానీ సిరయస్ విషయాల్లో తలదూర్తి రచ్చ రచ్చ చేస్తుంటాడు’. మీడియా అటెన్షన్ మొత్తం తనవైపుకు తిప్పుకుంటాడు. కేఏ పాల్ వెనుకాల చంద్రబాబు ఉన్నారని.. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడే పిలిపిస్తారనే టాక్ కూడా ఉంది. ఇప్పుడు జగన్ ను.. విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకునే కేఏ పాల్ వచ్చారని ప్రచారం సాగుతోంది.

    ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఊహించని విధంగా రంగంలోకి దిగారు. అధికార వైసీపీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిన్ననే ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలంటూ కేఏ పాల్ హైకోర్టుకెక్కారు. విద్యార్థులు పరీక్షల కోసం బయటకు వస్తే కరోనా సోకితే వారి ప్రాణాలకు ఎవరు భరోసా ఇస్తారని జగన్ సర్కార్ ను కేఏ పాల్ ప్రశ్నించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తుంటే.. ఏపీలో నిర్వహించడం ఏంటని కేఏ పాల్ పాల్ ప్రశ్నించారు. కరోనా సోకితే ఎవరు బాధ్యులని నిలదీశారు.

    తాజాగా ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని కేఏ పాల్ విశాఖలో నిరసన దీో చేపట్టారు. పరీక్షల నిర్వహణను జగన్ సర్కార్ విరమించుకునే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఏపీలోని 35 లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగే వరకు దీక్ష కొనసాగుతుందని పాల్ తెలిపారు.

    ఇప్పటికే జగన్ సర్కార్ ఈ పరీక్షలు నిర్వహించి తీరుతామని మొండిగా ముందుకు వెళుతోంది. మరోవైపు పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్ష పార్టీలు ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. వీరి మధ్య కేఏ పాల్ కోర్టు మెట్లు ఎక్కి న్యాయపోరాటం చేయడం చర్చనీయాంశమైంది. పాల్ వెనుక చంద్రబాబు ఉన్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.