బడ్జెట్‌లో న్యాయమే జరిగిందట..: సంజయ్‌ మాట

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నారు. అంత కాన్ఫిడెంట్‌గా ఆయన.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఏమేమి ఇచ్చారో చెబుతూ ప్రకటన చేయలేదు. కేసీఆర్.. హరీష్ రావు సైలెంట్‌గా ఉన్నారని .. అందుకే తెలంగాణకు అన్యాయం జరగలేదని లాజిక్ తీసుకున్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరిగింది కాబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆర్థిక మంత్రి హరీష్ విమర్శలు చేయటం లేదని బండి సంజయ్ చెబుతున్నారు. కేంద్ర బడ్జెట్‌పై రాజకీయ విమర్శలు […]

Written By: Srinivas, Updated On : February 7, 2021 3:44 pm
Follow us on


కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నారు. అంత కాన్ఫిడెంట్‌గా ఆయన.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఏమేమి ఇచ్చారో చెబుతూ ప్రకటన చేయలేదు. కేసీఆర్.. హరీష్ రావు సైలెంట్‌గా ఉన్నారని .. అందుకే తెలంగాణకు అన్యాయం జరగలేదని లాజిక్ తీసుకున్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరిగింది కాబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆర్థిక మంత్రి హరీష్ విమర్శలు చేయటం లేదని బండి సంజయ్ చెబుతున్నారు. కేంద్ర బడ్జెట్‌పై రాజకీయ విమర్శలు ఆపి.. సలహాలు సూచనలు ఇవ్వాలని ఇతర పార్టీల నేతలకు సూచించారు.

Also read: ఇప్పుడు అందరికీ మోహన్‌బాబే గుర్తొస్తున్నారు..: ఎందుకంటే..

బడ్జెట్‌లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం నిధులు ప్రకటించిందని.. ఇతర రాష్ట్రాలను పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో వారాంతాల్లో కేంద్రమంత్రులందరినీ ఆయా రాష్ట్రాలకు పంపించి.. బడ్జెట్ గురించి చెప్పాలని సూచించారు. అలా తెలంగాణకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వచ్చారు. ఆయన బడ్జెట్‌లో విశేషాలను మరోసారి చెప్పారు. అయితే విభజన చట్టం సహా.. ఏ విషయంలోనూ తెలంగాణకు ప్రత్యేకమైన నిధులు ఇవ్వలేదు. దీంతో.. ప్రజల్లో తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్‌తోపాటు ఇతర విపక్ష నేతలు మండి పడుతున్నారు.

కానీ.. టీఆర్ఎస్ నేతలు మాత్రం సైలెంటయ్యారు. కేసీఆర్ కేంద్ర బడ్జెట్‌పై పరిశీలన జరిపినా ఎన్ని నిధులు వస్తాయి.. వాటితో తెలంగాణ బడ్జెట్‌ను ఎలా సర్దుబాటు చేసుకోవాలన్న దానిపై సమీక్ష జరిపారు. కానీ.. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనలేదు. దీన్నే బీజేపీ నేతలు అలుసుగా తీసుకుంటున్నారు. బడ్జెట్ బాగుందన్న సర్టిఫికెట్‌కు.. ఆ నిశ్మబ్దాన్ని జోడిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలకు బడ్జెట్‌పై ఏం చెప్పాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.

Also read: యువ జగన్ ను చూసే కేటీఆర్ ను కేసీఆర్ సీఎం చేస్తున్నాడా?

మొత్తంగా ఇటీవల కేసీఆర్‌‌ ఢిల్లీ పర్యటనలకు వెళ్లడం.. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ ఆయన ఎక్కడా కేంద్ర ప్రభుత్వానికి యాంటీగా ఎక్కడా మాట్లాడడం లేదు. ఇప్పుడు బడ్జెట్‌ పైనా నోరు మెదకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్