https://oktelugu.com/

రమణ యాక్టివ్‌ రోల్‌..: ఎమ్మెల్సీగా బరిలోకి..

తెలుగుదేశం పార్టీ.. తెలంగాణలో మునిగిపోయే నావా అనే కన్నా.. మునిగిపోయిన నావా అంటేనే బాగుంటుందేమో. ఇప్పుడు జాతీయ పార్టీయే అయినప్పటికీ.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఏండ్ల పాటు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినా.. ఇప్పుడు ఆ పార్టీ పేరు కూడా వినిపించడం లేదు. అసలు ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీ రాజకీయంగా ఉందో లేదోనని వెతుక్కోవాల్సిన దుస్థితి ఉంది. కానీ.. అదేంటో ఇప్పుడు తెలంగాణ మళ్లీ యాక్టివ్‌ కావాలని చూస్తోందంట ఆ పార్టీ. ఈ మేరకు […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 7, 2021 / 03:37 PM IST
    Follow us on


    తెలుగుదేశం పార్టీ.. తెలంగాణలో మునిగిపోయే నావా అనే కన్నా.. మునిగిపోయిన నావా అంటేనే బాగుంటుందేమో. ఇప్పుడు జాతీయ పార్టీయే అయినప్పటికీ.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఏండ్ల పాటు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినా.. ఇప్పుడు ఆ పార్టీ పేరు కూడా వినిపించడం లేదు. అసలు ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీ రాజకీయంగా ఉందో లేదోనని వెతుక్కోవాల్సిన దుస్థితి ఉంది. కానీ.. అదేంటో ఇప్పుడు తెలంగాణ మళ్లీ యాక్టివ్‌ కావాలని చూస్తోందంట ఆ పార్టీ. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణ నిర్ణయం తీసుకున్నారట.

    Also Read: యువ జగన్ ను చూసే కేటీఆర్ ను కేసీఆర్ సీఎం చేస్తున్నాడా?

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎల్‌.రమణ ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే పోటీ చేశారు. ఇప్పుడు.. మరోసారి పోటీ చేసి తమ పార్టీ కూడా ఇంకా ఉందని చాటాలనుకుంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎల్.రమణ బరిలోకి దిగనున్నారు. రమణ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడమే కానీ ఎమ్మెల్సీగా బరిలోకి దిగలేదు. అయితే.. రాజకీయంగా తాను స్తబ్దుగా ఉంటే పార్టీ నాయకులు కూడా అంతే ఉంటారని.. తాను యాక్టివ్ అవ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

    తెలంగాణ ఏర్పడక ముందు జగిత్యాలలో ఎల్.రమణ వర్సెస్ జీవన్ రెడ్డి అన్నట్లుగా రాజకీయాలు ఉండేవి. ఒకసారి రమణ.. మరోసారి జీవన్ రెడ్డి గెలుస్తూ వచ్చేవారు. తెలంగాణ ఉద్యమం రావడం టీడీపీని ఆంధ్ర ప్రాంత పార్టీగా ప్రజల మనసుల్లో చొప్పించడంలో టీఆర్ఎస్ స‌క్సెస్ కావడంతో రమణ రాజకీయ పునాదులు కూడా కదిలిపోయాయి. అయితే పదవులు కోసం పార్టీ మారాలనే ఉద్దేశం లేని రమణ.. టీడీపీలోనే ఉండిపోయారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా తన నియోజకవర్గంలో జీవన్ రెడ్డి కోసం త్యాగం చేశారు. తర్వాత శేరిలింగంపల్లి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ పోటీ ఎక్కువగా ఉండటం.. పొత్తుల్లో వచ్చిన సీట్లు తక్కువ కావడంతో దూరంగానే ఉన్నారు.

    Also Read: ఇప్పుడు అందరికీ మోహన్‌బాబే గుర్తొస్తున్నారు..: ఎందుకంటే..

    ఇప్పుడు మళ్లీ పార్టీని యాక్టివ్‌ చేయాలని ఎల్‌.రమణ డిసైడ్‌ అయ్యారు. కొన్ని ప్రముఖ సంస్థలతో సర్వేలు చేయించుకొని ఎమ్మెల్సీ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. విద్యావంతుల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ఆదరణ ఉందని.. అలాగే రమణపై మంచి అభిప్రాయం ఉందని నివేదికలు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ ప్రకారం.. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ సారి రాజధాని పరిధిలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్ధండులు పోటీ పడుతున్నారు. వారిలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఉన్నారు. ఆయన గతంలో గెలిచారు కూడా. మొత్తానికి రమణ మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతుండడంతో పచ్చ జెండాలు మరోసారి కనిపించబోతున్నాయి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్