https://oktelugu.com/

కరోనా నుంచి కోలుకున్న వారికి మరో షాక్.. ప్రాణాంతక ఇన్ఫెక్షన్..?

భారత్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మరికొన్ని నెలల్లో వైరస్ పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్న వారిలో కొత్త ఆరోగ్య సమస్యలను శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ కు చెందిన వైద్య నిపుణులు కరోనా నుంచి కోలుకున్న వారిలో మ్యూకర్‌ మైకోసిస్ అనే ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్ ను గుర్తించారు. ఈ ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 7, 2021 / 04:02 PM IST
    Follow us on

    భారత్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మరికొన్ని నెలల్లో వైరస్ పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్న వారిలో కొత్త ఆరోగ్య సమస్యలను శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ కు చెందిన వైద్య నిపుణులు కరోనా నుంచి కోలుకున్న వారిలో మ్యూకర్‌ మైకోసిస్ అనే ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్ ను గుర్తించారు.

    ఈ ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడేవారికి, కేన్సర్‌, హెచ్‌ఐవీ రోగులు, అవయవ మార్పిడి చేయించుకునే వారికి సోకుతున్నట్టు తెలుస్తోంది. మ్యూకర్‌ మైకోసిస్‌ కరోనా సోకడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిన వారిపై సులభంగా దాడి చేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అహ్మదాబాద్‌ ప్రభుత్వ దంత వైద్యశాల సర్జన్‌ సోనల్‌ అంచ్‌లియా ఈ ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్ బారిన పడిన ఐదుగురు మరణించినట్లు వెల్లడించారు.

    ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డవారిలో కొంతమంది దృష్టిలోపం సమస్యతో బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. మ్యూకర్‌మైట్‌ మోల్డ్‌ అనే ఫంగస్ వల్ల మ్యూకర్‌ మైకోసిస్‌ ఫంగస్ సోకుతుందని.. ఈ ఫంగస్ సోకితే కేంద్ర నాడీ వ్యవస్థ, ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ పబలేలా చేయగలదని కరోనాలా జ్వరం, జలుబు వంటి ప్రాథమిక లక్షణాలు ఈ ఫంగస్ బారిన పడిన వారిలో కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    ఈ ఫంగస్ శరీరంలో రక్తప్రవాహానికి అడ్డుగోడలా నిలబడి ఎముక నిర్జీవమయ్యేలా చేస్తుందని.. ఈ ఇన్ఫెక్షన్ దవడ భాగానికి సోకితే దవడను తొలగించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.