https://oktelugu.com/

రణరంగంగా మారిన గాంధీ ఆస్పత్రి ప్రాంగణం

దేశంలో కరోనా మహ్మమరి విజృంభిస్తున్నప్పటికి వైద్యులు నిరంతరంగా వైద్యసేవలు కొనసాగిస్తున్నారు. అలాంటి వైద్యులపై కొందరు దాడులకు దిగటం ఆందోళన రేకెత్తిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే పలుమార్లు వైద్యులు దాడులు జరిగిన సంఘటనలు వెలుగుచూశాయి. తాజాగా మంగళవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో ఓ కరోనా రోగి మృతిచెందాడు. వైద్యులు నిర్లక్ష్యం వల్లే రోగి చనిపోయాడని అతడి తరుపు బంధువులు జూనియర్ వైద్యులపై దాడికి దిగారు. ఆస్పత్రిలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో వైద్యులు రాత్రి నుంచి మెరుపు సమ్మెకు దిగారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 10, 2020 / 03:08 PM IST
    Follow us on


    దేశంలో కరోనా మహ్మమరి విజృంభిస్తున్నప్పటికి వైద్యులు నిరంతరంగా వైద్యసేవలు కొనసాగిస్తున్నారు. అలాంటి వైద్యులపై కొందరు దాడులకు దిగటం ఆందోళన రేకెత్తిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే పలుమార్లు వైద్యులు దాడులు జరిగిన సంఘటనలు వెలుగుచూశాయి. తాజాగా మంగళవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో ఓ కరోనా రోగి మృతిచెందాడు. వైద్యులు నిర్లక్ష్యం వల్లే రోగి చనిపోయాడని అతడి తరుపు బంధువులు జూనియర్ వైద్యులపై దాడికి దిగారు. ఆస్పత్రిలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో వైద్యులు రాత్రి నుంచి మెరుపు సమ్మెకు దిగారు.

    వైద్యులపై దాడిని నిరసిస్తూ బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసన మధ్యాహ్నం వరకు తీవ్రరూపం దాల్చింది. రోడ్డుపై బైఠాయించి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేశారు.పెద్దసంఖ్యలో వైద్యులు, పీజీ మెడికోలు, ఇతర వైద్య విద్యార్థులు ఏకంగా కావడంతో నిరసన తీవ్రం రూపం దాల్చింది. వీరంతా ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రధాన రహదారిపై ధర్నా చేయడంతో వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగడంతో పోలీసులకు అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎం కేసీఆర్ వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని వారు స్పష్టం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    ఇదిలా ఉంటే ఆస్పత్రిలో చేరిన కరోనా పేషంట్ ఆస్పత్రిలో బాత్రూమ్ వెళుతూ కాలుజారి కిందపడి మృతిచెందినట్లు తెలుస్తోంది. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల అతడు కాలుజారి కిందపడి చనిపోయిన విషయాన్ని వైద్యులు బంధువులకు చెప్పలేదని సమాచారం. అనుమానం వచ్చిన వైద్యులను రోగి బంధువులు నిలదీయగా మృతదేహాన్ని చూపించారు. దీంతో కన్నీరు మున్నీరైన రోగి బంధువులు ఆవేశంలో డాక్టర్లపై దాడికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లు తెలుస్తోంది.