https://oktelugu.com/

‘పది’ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి..!

రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించే విషయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ స్పందించారు. ఇతర రాష్ట్రాలలో ఏ నిర్ణయం తీసుకున్నా ఏపీలో మాత్రం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి తీరతామని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులు అందరిని ప్రమోట్ చేయాలని నిర్ణయించాయి. గతంలో నిర్వహించిన పరీక్షల ఆధారంగా గ్రేడ్ లు నిర్ణయిస్తారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వాలు పదవ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 10, 2020 / 03:45 PM IST
    Follow us on


    రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించే విషయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ స్పందించారు. ఇతర రాష్ట్రాలలో ఏ నిర్ణయం తీసుకున్నా ఏపీలో మాత్రం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి తీరతామని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులు అందరిని ప్రమోట్ చేయాలని నిర్ణయించాయి. గతంలో నిర్వహించిన పరీక్షల ఆధారంగా గ్రేడ్ లు నిర్ణయిస్తారు.

    తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వాలు పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.ఈ నేపథ్యంలో ఏపీలో కూడా టెన్త్ పరీక్షలు రద్దవుతాయన్న ప్రచారం జరుగుతుంది. పరీక్షలు రద్దు చేయాలని సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు పోస్టులు పెడుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసే అవకాశం ఉందని విద్యార్థులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించారు.

    షెడ్యూల్ ప్రకారమే జులై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. కాకపోతే 11 పేపర్లను 6 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులను అనవసరమైన ప్రచారాలతో గందరగోళానికి గురిచేయొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా భద్రతా చర్యలు పటిష్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యం విషయంపై కూడా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తెలియజేశారు.