trump
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ప్రచార వేడిరాజుకుంటోంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుబోతున్నారు. రిపబ్లిక్ పార్టీ ట్రంప్ రెండోసారి పోటీ చేస్తుండగా.. డెమొక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా జో బైడిన్ పోటీ చేస్తున్నాడు.
Also Read: స్వేచ్ఛ లేని మీడియా.. స్వాతంత్ర్యం లేని జర్నలిస్టులు!
ఎప్పటిలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ముఖాముఖి చర్చలో పాల్గొన్నాడు. భారతకాలమాన ప్రకారం నేటి ఉదయం 6.30గంటలకు ట్రంప్-జో బైడిన్ మధ్య తొలి ముఖాముఖి చర్చ ప్రారంభమైంది. వీరివురికి సంధానకర్తగా క్రిస్ వాలెన్ వ్యవహరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికపై వచ్చిన ఆరోపణలు.. విమర్శలపై తొలి ప్రశ్న ఎదురుకాగా వాడివేడీగా చర్చ నడిచింది. నువ్వా.. నేనా అన్నట్లు ట్రంప్-జో బైడిన్ ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు.
అదేవిధంగా ట్రంప్ తీసుకొచ్చిన ఆరోగ్య బీమాపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా బిడెన్ మాట్లాడుతూ ఒబామా కేర్ పాలసీని ట్రంప్ నీరుగార్చరని ఆరోపించారు. ట్రంప్ కు ఆరోగ్య విధానంపై స్పష్టమైన పాలసీ లేదని ఆయన వల్లే వేలాది మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని వాపోయారు. కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు. ఆరోగ్యరంగానికి ట్రంప్ నామమాత్రంగా నిధులను వ్యయం చేశారని ఆరోపించారు. ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టడానికి ట్రంప్ వద్ద సరైన ప్రణాళికలు లేవని విమర్శించారు.
దీనిపై ట్రంప్ స్పందిస్తూ ఆరోగ్య బీమాను ప్రభుత్వం రద్దు చేయలేదని.. ప్రజలకు తక్కువ ధరలో వైద్య సేవలు అందించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. కరోనా సమయంలో తాము మెరుగైన వైద్యం అందించినట్లు తెలిపారు. ఒబామా కేర్ పాలసీ నిర్వహణ అంతా సులువు కాదని.. పెద్ద ఖర్చుతో కూడుకున్నదని అయినా కొనసాగించామని చెప్పారు. భారత్ సహా ఇతర దేశాల్లో కరోనాతో ఎంతమంది మృతిచెందారో బైడెన్‌కు తెలియదా అంటూ ట్రంప్ ప్రశ్నించాడు. ఈ సందర్భంగా కరోనా మృతుల విషయంలో అమెరికా కంటే భారత్ టాప్ లో ఉందంటూ ట్రంప్ తన అసమర్థతను భారత్ పైకి నెట్టాడు. భారత్ ను బూచీగా చూపి తను తప్పించుకునే ప్రయత్నాలు చేశారు.
Also Read: అమెరికా ఎన్నికల సరళి ఎలావుండబోతుంది?
ఇక తాను మాస్కు ధరించట్లేదని వస్తున్న ఆరోపణలను ఖండించారు. మాస్కు ఎప్పుడు తన వెంటే ఉంటుందని.. అవసరమైనపుడే దానిని వినియోగిస్తానంటూ స్పష్టం చేశారు. బో బిడెన్ తరహాలో ప్రజలకు 200మీటర్ల దూరంలో ఉండనంటూ ట్రంప్ ఘాటుగా స్పందించాడు. 47ఏళ్ల పాలనలో డెమొక్రటిక్ పార్టీ అమెరికన్లను చేసిందేమీ లేదన్నారు. వీరిద్దరి మధ్య తొలిముఖా ఢీ అంటే ఢీ అన్నట్లు సాగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.