నరేంద్ర మోడీ ఎంతో ఆదరణ కలిగిన నేత. అందులో ఏమాత్రం డౌట్ లేదు. అందుకే ఆయనకున్న ఇమేజీతో గుజరాత్‌కు అన్ని ఏళ్లపాటు సీఎంగా కొనసాగడమే కాకుండా.. దేశ ప్రధానిగా రెండు సార్లు బాధ్యతలు చేపట్టారు. మోడీ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంస్కరణలు.. ఎన్నో ప్యాకేజీలు ప్రకటించారు. కానీ.. ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలతో మోడీ ఇమేజీ తగ్గుతూ వస్తోంది. మొదట్లో ఉన్నంత ఆదరణ ఇప్పుడు కనిపించడం లేదట. దేశవ్యాప్తంగా ఆయన పరిపాలనపై అనుమానాలు పెరిగిపోయాయి.
Also Read: అచ్చెన్నాయుడు.. పాస్ అవుతారా? ఫెయిల్ అవుతారా?
కరోనా టైంలోనూ మోడీ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీపైనా ప్రజల నుంచి వ్యతిరేకతే వచ్చింది. ఆ ప్యాకేజీ కూడా ఇండస్ట్రియలిస్టులకే ఉపయోగపడ్డాయని పెదవివిరిచారు. ఇక కొత్తగా తీసుకొస్తున్న సంస్కరణలు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా విద్యుత్ సంస్కరణలు, వ్యవసాయ బిల్లులు ఇటీవల తీసుకొచ్చింది. దీంతో ఎన్డీయేలోని మిత్రపక్షాల నుంచే వ్యతిరేకత వచ్చింది. అకాలిదళ్ ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోవడం, కొంతమంది మంత్రి పదవులకు రాజీనామా చేయడం, మరికొన్ని పార్టీలు ఎన్డీయే నుంచి బయటకు వెళ్లే ఆలోచనలో ఉండడం ఇవన్నీ బీజేపీకి ఎదురు దెబ్బలే.
ఇక ఏపీ టీడీపీ వ్యవహారాన్ని ఒకసారి చూస్తే తుడుచుకుపెట్టుకుపోతున్న పార్టీకి రిపేర్ చేసే పనిలో పడ్డారు చంద్రబాబు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా, టీడీపీ రాజకీయ భవిష్యత్‌కు ఎటువంటి ఢోకా లేకుండా చేయవచ్చని, ఆ పార్టీ సహకారంతో 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావచ్చనే అభిప్రాయంతో బీజేపీ వెంట చంద్రబాబు పడుతున్నారట. ఆ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు అంతగా ఆసక్తితో లేదు. కానీ.. బాబు మాత్రం ఎందుకో బీజేపీ వెంట పడుతూనే ఉన్నారు.
Also Read: విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త.. అక్టోబర్ 5నే ఆ పథకం అమలు..?
బీజేపీ అగ్రనేతలను ప్రసన్నం చేసుకునేందుకు దారులు వెతుకుతూనే ఉన్నారు. ప్రస్తుతం రోజురోజుకూ మోడీ గ్రాఫ్ దేశవ్యాప్తంగా తగ్గిపోతున్న తరుణంలో.. బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ జాతీయ స్థాయిలో ఉద్యమిస్తే, టీడీపీ రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా ఉండదు. బీజేపీ వ్యతిరేకత పార్టీలన్నీ చంద్రబాబుకు జత కలిసే అవకాశం ఉంటుంది. అలాగే ఏపీలో ఆ పార్టీకి మంచి ఊపు వస్తుంది. కానీ.. వీటిని ఖాతరు చేయకుండా.. బీజేపీపై పోరు ప్రకటించకుండా జత కట్టేందుకే బాబు ప్రయత్నిస్తున్నారట. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని పార్టీ నేతలు సూచిస్తున్నా.. పాత లెక్కల్లోనే ఉండాలని అనుకుంటున్నాడట.