కృష్ణా బోర్డుపై జగన్‌ యూటర్న్‌..: విశాఖలో పెట్టాలంటూ కేంద్రానికి లేఖ

ఇప్పటికే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. దీంతో అక్కడ పాలన ప్రారంభించేందుకు ఉవ్విల్లూరుతున్నారు. కానీ.. ఆ కేసు కోర్టులో పెండింగ్‌లోనే ఉంది ఇంకా. అయినా.. ఒక్కొక్కటిగా ఆఫీసులను అక్కడికి తరలించాలని ఏపీ సర్కార్‌‌ చూస్తోంది. ఇందులోభాగంగా సంబంధం లేని కార్యాయాలను కూడా అక్కడకే తరలిస్తుండడం వివాదాలకు నిలయంగా మారుతోంది. Also Read: జేసీ బ్రదర్స్‌ ఆమరణ దీక్ష.. తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్..! P కృష్ణా రివర్ బోర్డు ఏపీకి..గోదావరి రివర్ బోర్డ్ తెలంగాణకు […]

Written By: Srinivas, Updated On : January 4, 2021 11:44 am
Follow us on


ఇప్పటికే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. దీంతో అక్కడ పాలన ప్రారంభించేందుకు ఉవ్విల్లూరుతున్నారు. కానీ.. ఆ కేసు కోర్టులో పెండింగ్‌లోనే ఉంది ఇంకా. అయినా.. ఒక్కొక్కటిగా ఆఫీసులను అక్కడికి తరలించాలని ఏపీ సర్కార్‌‌ చూస్తోంది. ఇందులోభాగంగా సంబంధం లేని కార్యాయాలను కూడా అక్కడకే తరలిస్తుండడం వివాదాలకు నిలయంగా మారుతోంది.

Also Read: జేసీ బ్రదర్స్‌ ఆమరణ దీక్ష.. తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్..!

P కృష్ణా రివర్ బోర్డు ఏపీకి..గోదావరి రివర్ బోర్డ్ తెలంగాణకు కేటాయించారు. ఉమ్మడి రాజధాని కాబట్టి కృష్ణాబోర్డు కూడా మొదట్లో హైదరాబాద్‌లోనే ఏర్పాటయింది. చంద్రబాబు పాలనను అమరావతి తీసుకువచ్చిన తర్వాత ఆ బోర్డును ఏపీలోకి తేవాలని విజయవాడలో కార్యాలయం పెట్టాలని కేంద్రానికి లేఖలు రాశారు.

Also Read: కేంద్రంలో బీజేపీ ఉండాలా.. ఏపీలో వైసీపీ ఉండాలా..!: ఇదే ఆ రెండు పార్టీల ఫ్రెండ్‌షిప్

అందుకు కేంద్రం కూడా సమ్మతించింది. ఆ మేరకు కొన్ని చర్యలు కూడా తీసుకుంది. విజయవాడలో కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి 2018లోనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అయితే.. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత కూడా.. అదే లేఖలను కేంద్రానికి పంపింది. ఎందుకో హఠాత్తుగా వైసీపీ మాట మార్చింది. రెండు రోజుల క్రితం కేఆర్ఎంబీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని మరో లేఖ రాశారు. దీంతో అందరిలోనూ ఆసక్తి రేపింది. కృష్ణానది నడిబొడ్డున ఉన్న విజయవాడలో కాకుండా బేసిన్ దాటి 500 కిలో మీటర్లు ఆవల విశాఖపట్నంలో ఎలా ఏర్పాటు చేస్తారన్న వాదన వినిపిస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ఇదిలా ఉండగా.. ప్రభుత్వం విశాఖకు కృష్ణా బోర్డు అనే సరికి కర్నూలు వాసులు కూడా డిమాండ్ చేయడం ప్రారంభించారు. సీపీఐ రామకృష్ణ.. కర్నూలులో కేఆర్ఎంబీ బోర్డును ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. కొంత మంది సాగునీటి రంగ నిపుణులు.. సీమ ఉద్యమకారులు కూడా అదే అడుగుతున్నారు. కేఆర్ఎంబీ ఉంటే విజయవాడలో.. లేకపోతే కర్నూల్‌లో ఉండాలి. కానీ విశాఖలో ఎందుకన్నదే చాలా మందికి అర్థం కానిది. అయితే.. పరిపాలనా రాజధానిగా విశాఖకు ఆమోద ముద్ర కోసమే జగన్‌ ఇలా చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.