Homeఆంధ్రప్రదేశ్‌AP Capital Issue: రాజధాని విషయంలో జగన్ సైలెంట్.. అది భారీ స్కెచ్‌లో భాగమేనట..

AP Capital Issue: రాజధాని విషయంలో జగన్ సైలెంట్.. అది భారీ స్కెచ్‌లో భాగమేనట..

AP Capital Issue: ఏపీకి అమరావతే రాజధాని అని పార్లమెంటులో కేంద్ర మంత్రి వెల్లడించారు. అందులో కొత్తేమీ లేదు. కానీ ఈ విషయంపై తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా ఇంకా రెచ్చిపోయింది. రాజధాని విషయంలో జగన్ ఓటమి పాలయ్యారని హంగామా మొదలు పట్టింది. ఆంధ్రప్రదేశ్‌కు ఏపీ మాత్రమే ఏకైక రాజధాని అని కేంద్రం గుర్తించిందని చేసిన హడావుడి అంతా ఇంకా కాదు. ఇలా మరోసారి జగన్ ను రెచ్చగొట్టేలా ప్రవర్తించింది.

AP Capital Issue
AP Capital Issue

దీంతో బీజేపీ, టీడీపీ నేతలు సైతం రెచ్చిపోయారు. కరెక్టుగా అమరావతి పాదయాత్ర జరుగుతున్న రోజులలోనే మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకున్నారు. కానీ భవిష్యత్తులో ఎలాంటి న్యాయ పరంగా సమస్యలు రాకుండా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నట్టు, త్వరలోనే
సమగ్ర బిల్లు తీసుకురానున్నట్టు మంత్రులు చెప్పుకొచ్చారు. ఎలాగైనా మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతామని చెప్పారు.

ముందుగా జగన్ పట్టుదలను చూసి కొందరు భయపడినా.. ఇప్పుడు వారు లైట్‌గా తీసుకుంటున్నారు. మూడు రాజధానుల విషయం ఇటీవలే పూర్తిగా వెనక్కి వెళ్లిపోగా కొన్ని వర్గాలు పండుగ చేసుకుంటున్నాయి. ఇదే టైంలో జిల్లాల విభజన హంగామా మొదలయింది. దీంతో మూడు రాజధానుల అంశం పూర్తిగా మూలన పడింది. దీంతో జగన్ ప్రభుత్వం ఇప్పటికిప్పుడే మూడు రాజధానుల అంశంపై కసరత్తు చేస్తుందని అనుకోలేము. దీనికి తోడు పీఆర్సీ విషయంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లాల పేర్లు మార్పు కోసం నిరసనలూ జరుగుతున్నాయి.

Also Read: మేడారం వెళ్లే భక్తులకు తీపికబురు.. మీ ఇంటి ముందుకే ఆర్టీసీ బస్సు సర్వీస్!

2024 ఎన్నికల వరకు ఈ వ్యవహారాన్ని ఇలాగే కొనసాగించుకుంటూ.. ఆ ఎన్నికల్లో మూడు రాజధానుల అంశాన్నే ప్రధాన ఎజెండాగా మార్చుకుంటుందనే వార్తలు సైతం వస్తున్నాయి. అందుకే బీజేపీ పార్లమెంటులో ప్రశ్నల రూపంలో రెచ్చుగొడుతున్నా.. ఈ డ్రామాను వెనకాల నుంచి టీడీపీ నడిపిస్తున్నా.. వైసీపీ మాత్రం స్పందించడం లేదు. ఇప్పుడు సైలెంట్‌గానే ఉంటూ.. ఎన్నికల టైంలో దెబ్బ కొట్టేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానుల అంశాన్ని జగన్ ప్రధాన ఎజెండాగా తీసుకుంటే.. ప్రతిపక్షాలు డైలమాలో పడతాయి. ఈ టైంలో మూడు రాజధానులను వ్యతిరేకిస్తాం అని ఆ పార్టీలు చెప్పే సాహసం చేయలేవు. ఈ ప్లాన్ తోనే జగన్ సైలెంట్ గా ఉంటున్నట్టు టాక్.

Also Read: ఏపీలో ‘చలో విజయవాడ’ టెన్షన్.. మోహరించిన ఉద్యోగులు, పోలీసులు.. ఏం జరుగనుంది?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version