https://oktelugu.com/

Sreeja: ‘నన్ను వదిలివెళ్ళినందుకు థాంక్స్’ అంటూ శ్రీజ ఎమోషనల్ పోస్ట్ ..! భర్త గురించేనా ?

Sreeja: మెగా డాటర్ చిరంజీవి చిన్న కుమార్తె ‘శ్రీజ’ తన భర్త పై సంచలన పోస్ట్ చేసింది. ‘నన్ను వదిలేసి వెళ్లినందుకు థాంక్స్…’ అంటూ శ్రీజ చేసిన మెసేజ్ ఆమె భర్తను ఉద్దేశించే అని అర్ధం అవుతుంది. అయితే, ఈ సంచలన పోస్ట్ పై ఆమె ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే శ్రీజ.. ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఇలా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. […]

Written By:
  • Shiva
  • , Updated On : February 3, 2022 / 01:24 PM IST
    Follow us on

    Sreeja: మెగా డాటర్ చిరంజీవి చిన్న కుమార్తె ‘శ్రీజ’ తన భర్త పై సంచలన పోస్ట్ చేసింది. ‘నన్ను వదిలేసి వెళ్లినందుకు థాంక్స్…’ అంటూ శ్రీజ చేసిన మెసేజ్ ఆమె భర్తను ఉద్దేశించే అని అర్ధం అవుతుంది. అయితే, ఈ సంచలన పోస్ట్ పై ఆమె ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే శ్రీజ.. ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఇలా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

    ఇక శ్రీజ నాలుగు రోజుల క్రితం తన అన్నయ్య మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తో కలిసి ముంబై మహా నగరంలో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. తన చెల్లెలు శ్రీజతో కలిసి రామ్‌ చరణ్‌ ముంబై వచ్చాడని తెలియగానే మీడియా సైతం వారి రాక కోసం అలెర్ట్ గా ఉంది. ఎయిర్‌ పోర్టు ఆవరణలో చెర్రీ తన చెల్లితో కనిపించగానే ఫొటోగ్రాఫర్లు వరుస ఫోటోలు తీశారు. చరణ్ కూడా తన చెల్లితో కలిసి సరదగా ఫోటోలు దిగాడు.

    Also Read:  ఏపీలో ‘చలో విజయవాడ’ టెన్షన్.. మోహరించిన ఉద్యోగులు, పోలీసులు.. ఏం జరుగనుంది?

    కాగా ఈ ఫోటోలు నెట్టింట బాగా హల్ చల్ చేశాయి. అయితే, శ్రీజతో కలిసి చెర్రీ ముంబైకి ఎందుకు వెళ్లాడన్న విషయం పై వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కానీ చెల్లితో క‌లిసి ముంబైలో రామ్ చ‌ర‌ణ్‌ కనిపించడం మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అన్నట్టు తన అన్నయ్య రామ్‌ చరణ్‌ తో కలిసి దిగిన ఫోటోలను శ్రీజ ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేస్తూ ఒక ఎమోషనల్ మెసేజ్ కూడా పెట్టింది.

    ఇంతకీ, శ్రీజ ఇన్‌ స్టాగ్రామ్‌ లో షేర్‌ చేసిన మెసేజ్ ఏమిటంటే.. ‘హగ్స్ అండ్‌ హగ్స్‌.. నేను బతకడానికి నాకు సంతోషాన్ని ఇచ్చే చిన్న చిన్న విషయాలివే, అని ‘నన్ను వదిలేసి వెళ్లినందుకు థాంక్స్…’ అంటూ శ్రీజ ఎమోషనల్‌ అయ్యింది. ఫోటోల్లో రామ్‌ చరణ్‌ పెట్‌ రైమ్‌ కూడా ఉంది. అన్నట్టు తన భర్త కళ్యాణ్ దేవ్ ను, శ్రీజ ఎందుకు దూరం పెట్టింది ? అసలు కళ్యాణ్ దేవ్ – శ్రీజ మధ్య వచ్చిన మనస్పర్థలు ఏమిటి ? వారిద్దరికీ ఎందుకు పొసగడం లేదు ? వంటి విషయాలు ఇంకా తెలియాల్సి.

    Sreeja

    మరోపక్క మెగా డాటర్ మరోసారి విడాకుల వైపు అడుగులు వేసిందనే వార్త మాత్రం మెగా అభిమానులను తీవ్రంగా బాధించాయి. ఇప్పటికే శ్రీజ, తన పేరు నుంచి కళ్యాణ్ దేవ్ పేరును తీసేసింది. భర్తకు దూరం అవుతున్నట్లు ఆమె ఇన్ డైరెక్ట్ గా ఈ విధంగా క్లారిటీ ఇచ్చింది అనుకోవాలి. అప్పట్లో సమంత కూడా మొదట ఇలాగే చేసింది. తన పేరుకు ముందు ఉన్న అక్కినేని పేరును ఆమె తీసేసింది. ఆ తర్వాత అక్కినేని కుటుంబానికి దూరం అయింది. ప్రస్తుతం శ్రీజ కూడా అదే పని చేసింది.

    కాబట్టి.. ఇక ఆమె జీవితంలో కళ్యాణ్ దేవ్ లేనట్టే. పైగా ‘నన్ను వదిలేసి వెళ్లినందుకు థాంక్స్’ అని శ్రీజ పెట్టిన మెసేజ్ కూడా ఈ విషయంలో ఒక స్పష్టతను ఇస్తోంది. అయితే, ఈ మెసేజ్ ను బట్టి.. కళ్యాణ్ దేవే, శ్రీజకు కావాలని దూరం అయ్యాడా ? అనుమానాలు కలుగుతున్నాయి.

    ఇక మెగా ఫ్యామిలీలో శ్రీజను ఎంతో అభిమానంగా చూస్తారు. ముఖ్యంగా మెగాస్టార్ కి శ్రీజ అంటే ప్రత్యేకమైన ప్రేమ. అందుకే, చిరు ఎప్పుడూ శ్రీజను గారాబం చేస్తూ ఉంటారు. కానీ ఆమె దాంపత్య జీవితంలో ఇలాంటి చేదు సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమైన విషయం.

    Also Read: కోటి తీసుకుంటూ ఇంకా కక్కుర్తి ఎందుకు ‘రాశీ ఖన్నా’ ?

    Tags