CM Jagan: ఆంధ్రా పై ఏడ్చేవారికి దెబ్బ కొట్టిన జగన్

అవశేష ఆంధ్రప్రదేశ్ కు తొలి సీఎంగా చంద్రబాబు వ్యవహరించారు. ఆ సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయా? అంటే సమాధానం లేదు. ఎద్దు ఈనిందంటే దూడను శాలలో కట్టేయండి అన్నట్టు ఉంది అప్పటి పరిస్థితి.

Written By: Dharma, Updated On : November 29, 2023 11:44 am

CM Jagan

Follow us on

CM Jagan: నిజం నింపాదిగా బయలుదేరక ముందే.. అబద్ధం ఊరంతా ప్రచారం చేసినట్టు ఉందిఏపీలో పరిస్థితి. జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా అదో విఫల ప్రయత్నంగా చూపడంలో విపక్షాలు, ఎల్లో మీడియా కొంతవరకు సక్సెస్ అవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను పెంచుతున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి విషయంలో వెనుకబాటు ఉందన్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. మరీ ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి విషయంలో మరీ ఎక్కువగా దుష్ప్రచారం జరుగుతోంది. వాస్తవ పరిస్థితికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రచారానికి పొంతన ఉండడం లేదు. అయితే తాము చేస్తున్న పనులు చెప్పుకోలేని స్థితిలో జగన్ సర్కార్ ఉండడం మైనస్ గా మారుతుంది.

అవశేష ఆంధ్రప్రదేశ్ కు తొలి సీఎంగా చంద్రబాబు వ్యవహరించారు. ఆ సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయా? అంటే సమాధానం లేదు. ఎద్దు ఈనిందంటే దూడను శాలలో కట్టేయండి అన్నట్టు ఉంది అప్పటి పరిస్థితి. పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయని.. లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చేస్తున్నాయని ఎల్లో మీడియా రకరకాలుగా ప్రచారం చేసింది. కానీ అవేవీ ప్రజల చెవిలోకి ఎక్కలేదు. ఇప్పుడు జగన్ విషయంలో సైతం పారిశ్రామిక అభివృద్ధి లేదని.. కనీస స్థాయిలో కూడా ఏపీకి పెట్టుబడులు రావడం లేదని.. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయని ఎల్లో మీడియా ఊరువాడా ప్రచారం చేస్తోంది. అయితే ఈసారి వ్యతిరేక భావనను అలవర్చుకున్న ప్రజలు ఎల్లో మీడియా ప్రచారాన్ని కొంతవరకు నమ్ముతున్నారు. అయితే ఈ విషయంలో సీఎం జగన్ జాగ్రత్త పడుతున్నారు.

వైసీపీ సర్కార్ హయాంలో పరిశ్రమలు వస్తున్నాయి. పారిశ్రామిక ఒప్పందాలు జరుగుతున్నాయి. కానీ దీనిని ఒప్పుకునేందుకు ఎల్లో మీడియా సాహసించడం లేదు. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ పి సి ఎల్ తో ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకుంది. రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి సదరు సమస్త ముందుకు వచ్చింది. 500 మెగావాట్ల చొప్పున సౌర, పవన విద్యుత్ ప్లాంట్లతో పాటు 250 మెగావాట్ల పంప్డు స్టోరేజ్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా సదరు సమస్త తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు. అవేరా స్కూటర్స్ తయారీ సంస్థ రూ. 100 కోట్ల విస్తరణ ప్రాజెక్టుకు సైతం ఇటీవల సీఎం శంకుస్థాపన చేశారు. అటు కేంద్ర ప్రభుత్వ నిధులతో సూక్ష్మ, చిన్న పరిశ్రమల క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద చాలా ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మొత్తం 21 ప్రాజెక్టులకు గాను.. కొన్నింటిని నిర్మాణం పూర్తయింది. మరోవైపు ఆగ్రో, ఆహార శుద్ధి, టెక్స్టైల్స్, కెమికల్స్, పెట్రో కెమికల్స్, ఆటోమొబైల్, ప్లాస్టిక్, ఫర్నిచర్, సేవా రంగాలకు సంబంధించి ప్రాజెక్టులు సైతం అందుబాటులోకి రానున్నాయి.

అయితే జగన్ సర్కార్ హయాంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్నా.. ఆ స్థాయిలో ప్రచారం మాత్రం జరగడం లేదు. సొంత మీడియా సాక్షి ఉన్నా.. ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో వచ్చిన కథనాలను ప్రజలు విశ్వసించడం లేదు. ఎల్లో మీడియా వ్యతిరేక ప్రచారం చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం జగన్ ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి కూడా ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ఏపీ ప్రభుత్వంపై ఏడ్చే వారికి ఈ తరహా ప్రయత్నాలు మింగుడు పడడం లేదు. ఎన్నికలు సమీపిస్తుండడంతో సీఎం జగన్ ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఎలా ముందుకెళ్తారో చూడాలి.