Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు 7 టాప్ 3 వీరే… టైల్ పోరులో ఆ ఇద్దరు!

ఫ్యామిలీ వీక్ లో భాగంగా కుటుంబ సభ్యులు రావడం .. అందరూ శివాజీ ని టాప్ లో పెట్టడం. ఇదంతా చూసి హౌస్ లో ఉన్న వాళ్ళతో పాటు ఆడియన్స్ కూడా శివాజీ విన్నర్ .. ప్రశాంత్ రన్నర్ అని ఫిక్స్ అయిపోయారు.

Written By: NARESH, Updated On : November 29, 2023 10:48 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఫినాలే రేస్ జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటి ఫైనలిస్ట్ అవ్వాలని కంటెస్టెంట్స్ తెగ కష్టపడుతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సీజన్ సగానికి పైనే పూర్తయింది. హౌస్ లో ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. వారిలో ది బెస్ట్ కంటెస్టెంట్స్ టాప్ 5 కి వెళ్తారు. కాగా టాప్ 5 లో ఈ ముగ్గురు కచ్చితంగా ఉంటారు అని ఆడియన్స్ గట్టిగా అభిప్రాయపడుతున్నారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ టాప్ 3 లో ఉంటారు అని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు.

అసలు పదో వారం వరకు శివాజీ నే విన్నర్ అని అంతా అనుకున్నారు. ఫ్యామిలీ వీక్ లో భాగంగా కుటుంబ సభ్యులు రావడం .. అందరూ శివాజీ ని టాప్ లో పెట్టడం. ఇదంతా చూసి హౌస్ లో ఉన్న వాళ్ళతో పాటు ఆడియన్స్ కూడా శివాజీ విన్నర్ .. ప్రశాంత్ రన్నర్ అని ఫిక్స్ అయిపోయారు. కానీ 10, 11, 12 వారాల్లో చాలా మార్పులు జరిగాయి. ఈ మూడు వారాలు శివాజీ కి ఒక్కటి కూడా సరైన ఎపిసోడ్ పడలేదు. పైగా అమర్ దీప్ కెప్టెన్సీ విషయంలో శివాజీ నెగిటివ్ అయ్యాడు. దీంతో లెక్కలు కాస్త తారుమారయ్యాయి.

అదే సమయంలో అమర్ దీప్ కి కలిసొచ్చింది. ఈ మూడు వారాలు అమర్ కి కీలకంగా మారాయి. అసలు టాప్ 5 లో ఉంటాడో లేదో కూడా తెలియని అమర్ .. ఏకంగా టైటిల్ రేస్ లో దూసుకొచ్చాడు. కెప్టెన్సీ కోసం అమర్ ఏడ్చిన తీరు ఆడియన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. దీంతో అమర్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. గత వారం ఓట్లు కూడా బాగా పడ్డాయి. ఇక ప్రశాంత్ ప్రతి టాస్క్ లో వంద శాతం ఎఫర్ట్ పెడుతూ సత్తా చూపిస్తున్నాడు.

ఎటువంటి కన్నింగ్ స్ట్రాటజీలు లేకుండా ఒక జన్యూన్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఓటింగ్ లో కూడా టాప్ లో ఉంటున్నాడు రైతు బిడ్డ. ఇలా ముగ్గురూ ఒకర్ని మించి మరొకరు అనే విధంగా ఉంటున్నారు. వీళ్ళు కచ్చితంగా టాప్ 3 లో ఫిక్స్ అయినట్టే. ఇందులో సందేహం లేదు. ఇక శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ లలో ఎవరు టైటిల్ కొట్టినా ఆశ్చర్యం లేదు. ఇక ఏం జరుగుతుందో చూడాలి మరి.