Venkaiah Naidu: ముప్పవరపు వెంకయ్యనాయుడు…దేశవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. బీజేపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. చిన్న వయసులోనే తన వాగ్ధాటితో పార్టీ నాయకుల తలలో నాలుకయ్యారు. స్వల్పకాలంలోనే పార్టీలో యాక్టివ్ రోల్ పాత్ర పోషించారు. అగ్రనాయకత్వం సరసన చేరారు. కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన్ను ఉప రాష్టపతిగా అప్ గ్రేడ్ అయ్యారు. కొద్దిరోజుల్లో రిటైర్మంట్ కానున్నారు. అయితే వెంకయ్యనాయుడు రాజకీయ ప్రస్థానం దాదాపు ముగిసిపోయినట్టేనన్న వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి పదవి ఆశించినా ఆయన్ను ఎంపిక చేయలేదు. అదే పార్టీకి చెందిన ద్రౌపది ముర్మను ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపిక చేశారు. పోనీ ఉప రాష్ట్రపతిగానైనా రెన్యూవల్ చేస్తారనుకుంటే పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధనఖడ్ ను ఖరారు చేశారు. దీంతో తనకు ఇంటిబాట తప్పదని వెంకయ్య నిర్ణయించుకున్నారు. అందుకే ముందస్తుగానే హస్తినాలో తన నివాసాన్ని సిద్ధం చేసుకున్నారు. అయితే వెంకయ్య విషయంలో బీజేపీ పెద్దలు చెబుతున్న మాట వయసు. ఆయనకు 73 సంవత్సరాలు. బీజేపీలో 75 సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మంట్ తప్పదు. పార్టీలో కూడా ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. అందుకే బీజేపీ ఉద్దండులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వారి జాబితాలో వెంకయ్య చేరనున్నారని టాక్ నడుస్తోంది.
సుదీర్ఘ ప్రయాణం…
బీజేపీలో వెంకయ్యనాయుడుది సుదీర్ఘ ప్రయాణం. 1993 వరకూ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న వెంకయ్యనాయుడు తరువాత ఢిల్లీ రాజకీయాల వైపు అడుగులేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా హస్తినా రాజకీయాల్లో అడుగు పెట్టారు. తన వాగ్ధాటి, అంకిత భావంతో అధిష్టానానికి, బీజేపీ శ్రేణులకు ఇష్టుడైన నాయకుడిగా మారిపోయారు. పార్టీ అధికార ప్రతినిధిగా బీజేపీ స్టాండ్ను గట్టిగానే చాటేవారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషిచేశారు.
Also Read: Cheetahs to prowl India : 70 ఏళ్ల తర్వాత భారత్ లోకి చిరుతలు.. ఈ రాజుల వేటతోనే అంతరించిపోయాయి!
బీజేపీ పార్లమెంటరీ బోర్డు, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి వంటి పదవుల్లో రాణించారు. రాజ్యసభలో విపక్షాలను అడ్డుకట్ట వేయడంలో కీ రోల్ ప్లే చేసేవారు. 2002లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. నాలుగుసార్లు రాజ్యసభకు ఎన్నికైన ఏకైక బీజేపీ నాయకుడిగా ఖ్యాతికెక్కారు. వాజుపేయి ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించినప్పుడు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది వెంకయ్యనాయుడే. పట్టణాభివృద్ది, గృహనిర్మాణం, పేదరిక నిర్మూలన, పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచార శాఖలను నిర్వర్తించి శాఖల్లో పురోగతి సాధించారు. అయితే ఉపరాష్ట్రపతి పదవిని కట్టబెట్టి వెంకయ్యను కట్టడి చేశారన్న టాక్ అప్పట్లోనే నడిచింది. మొత్తానికి మోదీ షా ద్వయం అడ్వాని గ్రూపులో ఒక్కొక్కర్నీ ఇంటిబాట పట్టించారని టాక్ నడుస్తోంది. అటు ఇంటా.. ఇటు బయట తమ మార్కు రాజకీయం చూపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఆ అవకాశం ఇస్తారా?
అయితే వెంకయ్యనాయుడు ఆరోగ్యపరంగా యాక్టివ్ గా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఇప్పటివరకూ ఆయన ప్రస్థానం చూసుకుంటే మాత్రం ఖాళీగా ఉండడానికి ఇష్టపడరు. తిరిగి ఆయన బీజేపీలో యాక్టివ్ ఉంటారని.. అయితే అది తెరవెనుక నుంచి పార్టీ బలోపేతానికి సలహాలు, సూచనలు ఇస్తారన్న టాక్ మాత్రం నడుస్తోంది. అయితే అది సాధ్యమయ్యే పనికాదు. వెంకయ్య చేసేవి సంప్రదాయ రాజకీయాలు, స్లో నరేషన్ లో నే నడపగలరు. పైగా మోదీ, షా ద్వయం చూస్తే డైనమిక్ రాజకీయాలు నడుపుతున్నారు. వారిద్దరు ఉండగా వెంకయ్యను రాణిస్తారంటే అనుమానమే. అందుకే పార్టీలో వెంకయ్య ప్రస్థానం దాదాపు ముగిసినట్టేనన్న వ్యాఖ్యలు మాత్రం వినిపిస్తున్నాయి. పోనీ ప్రభుత్వంలో కీరోల్ పాత్ర పోషిస్తారనుకుంటే అదీ లేదు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి స్థాయిలో పోస్టు అంటూ ఏదీ కనిపించడం లేదు. ఆ స్థాయి పోస్టును కూడా సృష్టించలేరు. ఒక వేళ ఆయనకు పదవి ఇవ్వాలని భావిస్తే ఉప రాష్ట్రపతిగా కొనసాగించి ఉండేవారని.. వయసురీత్యా బయటకు పంపుతున్నట్టు బీజేపీ పెద్దలు స్పష్టం చేయడంతో వెంకయ్యకు కూడా పరిస్థితి అర్థమైనట్టుంది. అందుకే తనంతట తానుగా గౌరవప్రదంగా తప్పుకోవాలని భావిస్తున్నారు. ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ నాడు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశముంది.
Also Read:CM Jagan- Early Elections: ముందస్తు మూడ్ లో జగన్.. క్లీన్ స్వీప్ సాధ్యమేనా?