https://oktelugu.com/

Rajinikanth-Kamal Haasan: రజిని కాంత్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో ముల్టీస్టార్ర్ర్ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరో తెలుసా ?

Rajinikanth-Kamal Haasan: ఖైదీ మరియు మాస్టర్ వంటి భారీ హిట్స్ తర్వాత ఆ చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ కమల్ హాసన్ తో తెరకెక్కించిన విక్రమ్ సినిమా ఈ ఏడాది విడుదలై ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలకు మించి సెన్సషనల్ హిట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి సుమారు 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి సంచలనం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 21, 2022 / 09:56 AM IST
    Follow us on

    Rajinikanth-Kamal Haasan: ఖైదీ మరియు మాస్టర్ వంటి భారీ హిట్స్ తర్వాత ఆ చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ కమల్ హాసన్ తో తెరకెక్కించిన విక్రమ్ సినిమా ఈ ఏడాది విడుదలై ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలకు మించి సెన్సషనల్ హిట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి సుమారు 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది..లోకేష్ మాస్టర్ సినిమా తర్వాత తాను తియ్యబోయ్యే సినిమాలన్నీ కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ గా చెయ్యబోతున్నాడు..అంతే ఒక సినిమాకి లింక్ గా మరో సినిమాని కనెక్ట్ చెయ్యడం..విక్రమ్ సినిమాని కూడా తన ఖైదీ సినిమాతో లింక్ చెయ్యడం ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేసింది..రెండు ఆయన తియ్యబోయ్యే విక్రమ్ 2 లో కూడా ఖైదీ తో లింక్ ఉంటుంది అన్నమాట..ఇప్పుడు ఈ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో త్వరలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా చేరబోతున్నట్టు ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ.

    Rajinikanth-Kamal Haasan

    విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో ప్రముఖ తమిళ హీరో సూర్య ని రోలెక్స్ గా ఒక 5 నిమిషాల అతిధి పాత్రని లోకేష్ పరిచయం చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ పాత్ర కొనసాగింపు విక్రమ్ 2 లో ఉంటుంది..అయితే విక్రమ్ 2 క్లైమాక్స్ లో ఇలాగె సూపర్ స్టార్ రజినీకాంత్ ని కూడా తన సినిమాటిక్ యూనివర్స్ లో పరిచయం చేయబోతున్నారట కమల్ హాసన్..తమిళ సినిమా ఇండస్ట్రీ కి రెండు కళ్ళు లాగ ఉండే రజినీకాంత్ మరియు కమల్ హాసన్ కలిసి ముల్టీస్టార్ర్ర్ సినిమా చేస్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మొత్తం బద్దలవ్వడం ఖాయం అని చెప్పొచ్చు..వీళ్లిద్దరు కలిసి కెరీర్ ప్రారంభం లోనే ఎక్కువ సినిమాలు చేసారు.

    Also Read: Brigida Saga: అతని కోసమే నగ్నంగా నటించా.. బ్రిగిడి ఆసక్తికర వ్యాఖ్యలు

    Rajinikanth-Kamal Haasan

    ఆ తర్వాత హీరో గా ఎవరికీ వారు సొంత స్టార్ స్టేటస్ సంపాదించుకున్న తర్వాత ఇప్పటి వరుకు వీళ్లిద్దరు కలిసి ఒక్క సినిమా చెయ్యలేదు..మళ్ళీ 30 ఏళ్ళ తర్వాత వీరి కాంబినేషన్ రాబోతుంది అనే వార్త రావడం తో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పొయ్యాయి..మరి క్రేజీ కాంబినేషన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో చూడాలి.

    Also Read:Dil Raju- Ram Pothineni: అల్లు అర్జున్ తో చెయ్యాల్సిన సినిమా హీరో రామ్ తో చెయ్యబోతున్న దిల్ రాజు

    Tags