కేసీఆర్ అన్నది రేవంత్, షర్మిల గురించేనా..?

చాలా రోజుల తరువాత టీఆర్ఎస్ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఇన్నాళ్లు జోరుగా ప్రచారం జరిగిన ఎన్నో ఊహాగానాలకు అధినేత కేసీఆర్ తెరదించారు. చాలా విషయాల్లో నేతలకు క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు కీలక వ్యాఖలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారన్నదానిపై ఇంకా గులాబీ నేతలు క్లారిటీకి రావడం లేదు. కానీ కేసీఆర్ ఇద్దరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు టీఆర్ఎస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కొత్తపార్టీ ఏర్పాటు అంత […]

Written By: Srinivas, Updated On : February 9, 2021 11:46 am
Follow us on


చాలా రోజుల తరువాత టీఆర్ఎస్ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఇన్నాళ్లు జోరుగా ప్రచారం జరిగిన ఎన్నో ఊహాగానాలకు అధినేత కేసీఆర్ తెరదించారు. చాలా విషయాల్లో నేతలకు క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు కీలక వ్యాఖలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారన్నదానిపై ఇంకా గులాబీ నేతలు క్లారిటీకి రావడం లేదు. కానీ కేసీఆర్ ఇద్దరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు టీఆర్ఎస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కొత్తపార్టీ ఏర్పాటు అంత సులువు కాదని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వైఎస్ షర్మిల, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నవే అంటున్నరు గులాబీ నేతలు.

Also Read: షర్మిల ఎవరు వదిలిన బాణం..?

ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొత్తపార్టీ అంత సులువు కాదని అన్నారు. దానికి ఎంతో శ్రమించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. గతంలో నరేంద్ర, విజయశాంతి, దేవేందర్ గౌడ్ పార్టీలు పెట్టి ఏమయ్యారని ప్రశ్నించారు. నాలుగు రోజుల్లో కొత్తగా పార్టీ పెట్టేవారు తొకముడిచి వెళతారని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో వస్తున్న కొత్తపార్టీలకు భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ గులాబీ నేతలకు హితబోధ చేశారు.

అయితే కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు వైఎస్ షర్మిలను ఉద్దేశించినవేనని అంటున్నారు పలువురు. వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్తపార్టీ పెట్టబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. జగన్ తో విభేదించిన షర్మిల తెలంగాణలో కొత్తపార్టీ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నారని, దీని వెనక వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన తెలంగాణకు చెందిన కీలక నేత ఉన్నారన్న వదంతులు వినిపించాయి. మంగళవారం షర్మిల ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. దీనికి వైసీపీ నుంచి కూడా ఎలాంటి అనుకూల, వ్యతిరేక ప్రకటనలు రాలేదు. ఈ సమావేశంలో షర్మిల పార్టీపై పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Also Read: ఉక్కు ఉద్యమానికి టీడీపీ దూరం.. సడెన్ గా ఏమైంది..?

ఇక మరోవైపు రేవంత్ రెడ్డి కూడా కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తెలంగాణలో బలహీనపడడం, కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత లేకపోవడం ఆయన కొత్తపార్టీ ఏర్పాటుకు రంగ సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గాన్ని ఏకం చేసేనేతగా, కేసీఆర్ ను బలంగా ఎదుర్కొనే లీడర్ గా రేవంత్ రెడ్డి కొత్తపార్టీ పెడితే.. సక్సెస్ అవుతారా.. అన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వీరిద్దరిని ఉద్దేశించినవేనని పార్టీలో చర్చ జోరు గా సాగుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్