షర్మిల ఎవరు వదిలిన బాణం..?

తెలంగాణ రాష్ట్రం వేదికగా వైఎస్‌ రాజశేఖర్‌‌రెడ్డి కూతురు షర్మిల రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. దీనిపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఆమె సంప్రదింపులు కూడా ఇప్పటికే స్టార్ట్‌ చేశారు. ఇవాళ కాకుంటే రేపు ఆమె పార్టీ పేరును ప్రకటించడం ఖాయమని స్పష్టం అవుతోంది. ఈనేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. షర్మిల ఎవరు వదిలిన బాణం..? అన్న అంశంపైనే చర్చ జరుగుతోంది. Also Read: పాదయాత్రతోనైనా పీసీసీ పీఠం రేవంత్ కు లభిస్తుందా? ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డినే […]

Written By: Srinivas, Updated On : February 9, 2021 11:36 am
Follow us on


తెలంగాణ రాష్ట్రం వేదికగా వైఎస్‌ రాజశేఖర్‌‌రెడ్డి కూతురు షర్మిల రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. దీనిపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఆమె సంప్రదింపులు కూడా ఇప్పటికే స్టార్ట్‌ చేశారు. ఇవాళ కాకుంటే రేపు ఆమె పార్టీ పేరును ప్రకటించడం ఖాయమని స్పష్టం అవుతోంది. ఈనేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. షర్మిల ఎవరు వదిలిన బాణం..? అన్న అంశంపైనే చర్చ జరుగుతోంది.

Also Read: పాదయాత్రతోనైనా పీసీసీ పీఠం రేవంత్ కు లభిస్తుందా?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డినే వ్యూహాత్మకంగా పార్టీ పెట్టిస్తున్నారా..? లేకపోతే.. బీజేపీకి చెక్ పెట్టడానికి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారా..? లేకపోతే.. కేసీఆర్‌కు గండి కొట్టడానికి బీజేపీ ఈ స్కెచ్ వేసిందా..? అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. కానీ.. షర్మిల సొంతంగా పార్టీ పెట్టేసి.. తెలంగాణ సీఎం అయిపోతుందని మాత్రం ఎవరూ అంచనా వేయడం లేదు. ఆంధ్రప్రాంతానికి చెందిన నేత తెలంగాణలో పార్టీ పెట్టాలనే ఆలోచనే వినూత్నం. ఆ ఆలోచనను షర్మిల చేశారు. అన్నతో విభేదాలొస్తే ఏపీలో పార్టీ పెట్టుకుంటారు. కానీ.. తెలంగాణలో ఎందుకు పెడతారన్నది డౌట్‌ చాలా మందిలోనే కనిపిస్తోంది.

తెలంగాణలో మారిపోతున్న రాజకీయ పరిస్థితుల కారణంగా అర్జంట్‌గా కేసీఆర్ కొత్త వ్యూహాలను అమలు చేయాల్సిన పరిస్థితిలో పడ్డారని.. ఆయనే జగన్మోహన్ రెడ్డితో కలిసి షర్మిలతో కొత్త పార్టీ ప్లాన్ చేశారని ఓ వర్గం అంచనా వేస్తోంది. దీనికి రకరకాల సమీకరణాలు చెబుతున్నారు. షర్మిల పార్టీ పెడితే రెడ్డి సామాజికవర్గంతోపాటు కన్వర్టడ్ క్రిస్టియన్, దళితులు మద్దతుగా నిలుస్తారని చెబుతున్నారు. ఇలాంటి వారిలో అత్యధికం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. అయితే.. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఎన్నికలు జరిగితే వారంతా బీజేపీ వైపు వెళ్తారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ గట్టిగా పోరాడి నమ్మకం కలిగిస్తే.. వారంతా కాంగ్రెస్‌తోనే ఉంటారు. ఈ పరిస్థితిని అవాయిడ్ చేయడానికి ఓట్లు చీల్చడానికి కేసీఆర్ ఈ వ్యూహం పన్నారని అంటున్నారు.

Also Read: తెలంగాణలో ‘షర్మిల కొత్త పార్టీ’ కోలాహలం?

మరోవైపు షర్మిలకు బీజేపీ సపోర్ట్ ఉందన్న ప్రచారం కూడా ఉంది. కేసీఆర్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్ పెట్టాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ షర్మిల పార్టీని రంగంలోకి తెచ్చినట్లుగా చెబుతున్నారు. షర్మిల పార్టీ పెడితే.. ఆ ప్రభావం ఎక్కువగా అధికార పార్టీ పైనే పడుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ పూర్తిగా కనుమరుగు కావడంతోపాటు.. అధికార వ్యతిరేకత మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

షర్మిల ఇప్పటికే అమిత్ షాతో చర్చలు జరిపారని.. త్వరలో ప్రత్యక్షంగా కలుస్తారని ఆమె బీజేపీతో కలిసి నడుస్తుందన్న అంచనాలను ఇప్పటికే ఆ పార్టీలోని ఓ వర్గం ప్రచారం చేయడం ప్రారంభించింది. ఇవేమీ కాదు.. అసలు జగన్మోహన్ రెడ్డి.. తన కుటుంబానికి అధికారం కోసం ఇలా చెల్లితో గేమ్ ఆడిస్తున్నారన్న అనుమానాలు కూడా కొంత మందిలో ఉన్నాయి. అంతేకాదు.. షర్మిల పార్టీ పనుల్లోనూ అత్యధికంగా వైసీపీ నేతలే కనిపిస్తుండడం కొసమెరుపు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్