https://oktelugu.com/

ఈ ఆవు ధర 2.61 కోట్ల రూపాయలు.. ఎందుకంత ఖరీదంటే..?

సాధారణంగా ఆవు ధర వేలల్లో ఉంటుంది. మరీ మేలు జాతి ఆవు లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆవు ధర మాత్రం ఏకంగా 2.61 కోట్ల రూపాయలు. పోష్ స్పైన్ పేరుతో పిలిచే ఈ ఆవు అత్యుత్తమ జాతి ఆవుల్లో ఒకటి కావడం గమనార్హం. ఈ ఆవును వేలం వేయగా వేలంలో ఎక్కువ రేటుకు అమ్ముడుపోయి ఆవు ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఈ ఆవు వయస్సు కేవలం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 9, 2021 / 11:56 AM IST
    Follow us on

    సాధారణంగా ఆవు ధర వేలల్లో ఉంటుంది. మరీ మేలు జాతి ఆవు లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆవు ధర మాత్రం ఏకంగా 2.61 కోట్ల రూపాయలు. పోష్ స్పైన్ పేరుతో పిలిచే ఈ ఆవు అత్యుత్తమ జాతి ఆవుల్లో ఒకటి కావడం గమనార్హం. ఈ ఆవును వేలం వేయగా వేలంలో ఎక్కువ రేటుకు అమ్ముడుపోయి ఆవు ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఈ ఆవు వయస్సు కేవలం 14 నెలలు కావడం గమనార్హం.

    Also Read: ఓటర్ స్లిప్ లేదా.. డిజిటల్ ఓటర్ ఐడీ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే..?

    మధ్య ఇంగ్లండ్ కు చెందిన ఈ ఆవు గతంలో అమ్ముడైన ఆవులతో పోలిస్తే రెట్టింపు ధర పలకడం గమనార్హం. గతంలో కోటీ 31 లక్షలకు అమ్ముడై ఒక ఆవు రికార్డు నెలకొల్పగా దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఆ ఆవు రికార్డులను ఈ ఆవు అధిగమించింది. ఎక్కువ ధర పలకడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

    Also Read: ఆ ఖాతాకు ఆధార్ లింక్ చేయలేదా.. 2.30 లక్షలు నష్టపోయే ఛాన్స్..?

    ఈ ఆవు పొడిగ్రీ జాతికి చెందిన ఆవు కాగా ఒక ఫేమస్ పాప్ బ్యాండ్ అంటే ఇష్టం ఉన్న ఆవు ఓనర్లు ఆవుకు ఈ వింత పేరును పెట్టారు. ఈ 14 నెలల వయస్సు ఉన్న ఆవు క్రిస్టీన్ అనే వ్యక్తికి చెందిన ఆవు కాగా ఆవు 2.61 కోట్ల రూపాయలకు అమ్ముడవడంతో తమకు లాటరీ తగిలినట్లుగా ఉందని ఆవు ఖరీదు లక్షల్లో అమ్ముడవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెబుతున్నారు. ఆవు ధర భారీగా పలకడంతో తాము లాటరీ తగిలినట్లుగా భావిస్తున్నామని చెబుతున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఆవుకు అందరినీ ఆకర్షించే రూపంతో పాటు చూడటానికి ఎంతో అందంగా ఉందని ఈ కారణాల వల్లే ఆవు ధర ఎక్కువ పలికిన్దని క్రిస్టీన్ అన్నారు. ప్రపంచంలోని ఉత్తమ జాతి ఆవులలో ఇది కూడా ఒకటని ఈ ఆవును వేలం పెడితే ఊహించని రేటు సొంతమైందని క్రిస్టీన్ తెలిపారు.