ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని సందర్భాల్లో మొండిగా ముందుకెళతాడు. కొన్ని సందర్భాల్లో ఆ మొండితనం వైసీపీకి మంచే చేసినా చాలా సందర్భాల్లో జగన్ కు చెడే జరగడం గమనార్హం. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలకు హైకోర్టు, సుప్రీం కోర్టులలో ఎదురుదెబ్బలు తగలడానికి కూడా జగన్ సర్కార్ వ్యవహరించిన తీరే కారణం. కొన్ని సందర్భాల్లో జగన్ తీసుకున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతలనే షాక్ కు గురి చేస్తూ ఉంటాయి.
Also Read : కేంద్రంలో వియ్యం.. రాష్ట్రంలో కయ్యం..
ఎలాంటి సమస్యకైనా వేగంగా నిర్ణయం తీసుకోవడం జగన్ బలం, బలహీనత. సాధారణంగా ఎంతటి వాళ్లైనా న్యాయస్థానం జోలికి వెళ్లడానికి ఇష్టపడరు. న్యాయస్థానాల వ్యవహారాల్లో సౌమ్యంగా వ్యవహరించడానికే నేతలు, సినీ ప్రముఖులు మొగ్గు చూపుతూ ఉంటారు. న్యాయస్థానాల తీర్పులను గౌరవిస్తూ తీర్పు నచ్చని పక్షంలో పై కోర్టుకు వెళతారే తప్ప న్యాయస్థానాల తీర్పులపై కామెంట్ చేయారు.
అయితే జగన్ సర్కార్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సీఎం జగన్ ఇప్పటికే అవినీతి కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నప్పటికీ కోర్టులతో పరోక్షంగా జగన్ సర్కార్ ఘర్షణకే సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిజానికి కేసీఆర్, మోదీలకు అధికారంలోకి వచ్చిన కొత్తలో తీసుకున్న నిర్ణయాలకు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఆ తరువాత తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి మోదీ, కేసీఆర్ జాగ్రత్త పడ్డారు.
అయితే జగన్ సర్కార్ విషయంలో మాత్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయితే జగన్ న్యాయస్థానాలతో పెట్టుకోవడాన్ని అంత తేలికగా చూడవద్దని వ్యూహంలో భాగంగానే జగన్ ఈ విధంగా ముందుకెళుతున్నాడని… 16 నెలలు జైలు జీవితం గడిపిన జగన్ ఇంత మొండిగా ముందుకెళుతున్నాడంటే అందుకు బలమైన కారణాలే ఉండి ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : ఈ వైసీపీ ఎంపీ మాటలు భలే ఉన్నాయే..?