https://oktelugu.com/

హైపర్ ఆదిని చితకబాదిన దొరబాబు భార్య..!

బుల్లితెర ప్రేక్షకులను జబర్దస్త్ కామెడీ షో ఎంతగానో అలరిస్తుంటుంది. ఈ షో టీవీ టీఆర్పీ రేటింగ్ ఎవరికీ అందనంతగా దూసుకెళుతోంది. ఈ షోలో ఒక్కో టీం ఒక్కోలా అలరిస్తూ ఉంటోంది. ముఖ్యంగా ఆది టీమ్ చేసే కామెడీని చూసేందుకు ఆడియెన్స్ ఇష్టపడుతుంటారు. ఆది వేసే పంచ్ డైలాగులకు ప్రేక్షకులకు ఫిదా అవుతుంటారు. నిత్యం జరిగే సంఘటనలను తన స్కీప్టులో రాసుకొని అందరిచేత నవ్వులజల్లులు పూయిస్తుంటాడు హైపర్ ఆది. Also Read: ప్రభాస్.. ఎనిమిది అడుగులు, మూడు పాత్రలు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 18, 2020 / 12:23 PM IST

    hyper aadi

    Follow us on


    బుల్లితెర ప్రేక్షకులను జబర్దస్త్ కామెడీ షో ఎంతగానో అలరిస్తుంటుంది. ఈ షో టీవీ టీఆర్పీ రేటింగ్ ఎవరికీ అందనంతగా దూసుకెళుతోంది. ఈ షోలో ఒక్కో టీం ఒక్కోలా అలరిస్తూ ఉంటోంది. ముఖ్యంగా ఆది టీమ్ చేసే కామెడీని చూసేందుకు ఆడియెన్స్ ఇష్టపడుతుంటారు. ఆది వేసే పంచ్ డైలాగులకు ప్రేక్షకులకు ఫిదా అవుతుంటారు. నిత్యం జరిగే సంఘటనలను తన స్కీప్టులో రాసుకొని అందరిచేత నవ్వులజల్లులు పూయిస్తుంటాడు హైపర్ ఆది.

    Also Read: ప్రభాస్.. ఎనిమిది అడుగులు, మూడు పాత్రలు !

    తనకంటూ ఓ ప్రత్యేకను చాటుకుంటూ జబర్దస్త్ జడ్జీల చేత హైపర్ ఆది శభాష్ అనిపించుకుంటున్నాడు. కాగా నిన్న జరిగిన జబర్దస్త్ షోలో హైపర్ ఆదిని దొరబాబు భార్య చితకబాదింది. దీంతో ప్రేక్షకులంతా అవాక్కయ్యారు. అయితే ఇదంతా  స్కిట్లో భాగంగానే జరిగింది. నిన్నటి ఎపిసోడ్ దొరబాబు భార్య అమ్ము జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హైపర్ ఆది టీములో నటించి అందరి మన్నలను పొందించింది. ఆమె ఆది టీంలో ఫార్మ మెన్స్ చేయడం షోకే హైలెట్ గా నిలిచింది.

    హైపర్ ఆది తన స్కిట్ లో దొరబాబుపై కామెడీ పంచులు వేస్తూ అలరిస్తుంటాడు. దొరబాబు గతంలో నటించిన బీగ్రేడ్ సినిమాలు.. ఇటీవల బ్రోతల్ కేసులు అరెస్టయి బయటికి రావడాన్ని ప్రతీసారి హైపర్ ఆది స్కిట్లో గుర్తు చేస్తుంటాడు. దొరబాబుపై పంచులు వేస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటాడు.  ఈసారి స్కిట్లోనూ హైపర్ ఆది అదే కామెడీతో అలరించాడు.

    ఈసారి దొరబాబు భార్య అమ్ములు ముందే దొరబాబు పరువును హైపర్ ఆది మొత్తం తీసేశాడు. దొరబాబు గతంలోనే చేసిన సంఘటనపై అదిరిపోయే పంచులు వేశాడు. దీంతో తనకు ఇంకా పెళ్లి కాలేదంటూ దొరబాబు చెప్తాడు. ఆ వెంటనే దొరబాబు రియల్ భార్య అమ్ము నేను ఎవరినీ అంటూ సీన్లోకి వస్తోంది.  నన్నెమో అమ్ము.. అమ్ము అంటావ్.. అక్కడ నువ్వే చేసే పనులు చూసి నేనేమో అమ్మో.. అమ్మో అనాల్సి వస్తుందంటూ ఆమె పంచులు వేస్తుంది.

    Also Read: సినీ సెలబ్రెటీలకు వారి నుంచే డ్రగ్స్?

    ఆ తర్వాత దొరబాబును కూడా అమ్ము దంచికొడుతోంది. ఈ సందర్భంగా హైపర్ ఆదితో మా ఆయన ఇంత చేస్తే.. నువ్వు అంత చేస్తున్నావు.. ఆయనను కాదు.. నిన్ను కొట్టాలంటూ హైపర్ ఆదిని సైతం అమ్ము చితకబాదింది. దీంతో స్టేజంతా నవ్వులు పూశాయి. హైపర్ ఆది ఏకంగా దొరబాబును అతడి భార్యతోనే  కొట్టించడంతోపాటు తాను కూడా అమ్ము చేతిలో తన్నులు తిన్నాడు.  దొరబాబునే కాకుండా అతని భార్య అమ్ము ను కూడా  స్కిట్లో హైపర్ ఆది వాడి కామెడీని పండించడం కొసమెరుపు.