Telangana: తెలంగాణకు 9, ఏపీకి 10.. సుపరిపాలనలో రెండు స్టేట్లకు ఆసక్తికరమైన సూచీలు

Telangana: దేశంలో స్టేట్ల పరిపాలన ఆధారంగా స్థానాలు కేటాయిస్తుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్లలో కొనసాగుతున్న పరిపాలనను లెక్క గట్టి మనకు ఓ స్థానం కేటాయించడం చూస్తుంటాం. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా 2020-21 సంవత్సరానికి సంబంధించి పరిపాలనలో చేపడుతున్న విధానాల పరంగా సూచీలు కేటాయించనున్నారు. ఇందులో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం స్థానాలు సూచించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విడుదల చేసిన నివేదికలో 10 రంగాల్లో 58 సూచికల ఆధారంగా ర్యాంకింగ్ ను […]

Written By: Srinivas, Updated On : December 26, 2021 7:23 pm
Follow us on

Telangana: దేశంలో స్టేట్ల పరిపాలన ఆధారంగా స్థానాలు కేటాయిస్తుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్లలో కొనసాగుతున్న పరిపాలనను లెక్క గట్టి మనకు ఓ స్థానం కేటాయించడం చూస్తుంటాం. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా 2020-21 సంవత్సరానికి సంబంధించి పరిపాలనలో చేపడుతున్న విధానాల పరంగా సూచీలు కేటాయించనున్నారు. ఇందులో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం స్థానాలు సూచించింది.

Telangana and Andhra Pradesh

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విడుదల చేసిన నివేదికలో 10 రంగాల్లో 58 సూచికల ఆధారంగా ర్యాంకింగ్ ను కేటాయించారు. ఇందులో తెలంగాణకు తొమ్మిది, ఆంధ్రప్రదేశ్ కు పదో స్థానాలు దక్కాయి. దీంతో రెండు ప్రాంతాల్లో చేపడుతున్న పథకాలు, పనుల ఆధారంగా ఈ నెంబర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల్లోని పరిపాలనలో ఇంకా మార్పులు రావాల్సిన అవసరం ఏర్పడింది.

ఇప్పటికే తెలంగాణ ధనిక రాష్ర్టంగా రికార్డులకెక్కిందని పాలకులు చెబుతున్నా ఇటీవల పార్లమెంట్ లో తెలంగాణ అప్పులు చూస్తుంటే మతి పోతోంది. దాదాపు రూ.2.37 లక్షల కోట్ల అప్పులున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి వివరాలు వెల్లడించడం విశేషం. మరోవైపు సీఎం కేసీఆర్ మాత్రం మనది ధనిక రాష్ర్టమని కాగ్ నివేదిక చెప్పిందని గుర్తు చేస్తుంటారు.

ఈ నేపథ్యంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సుపరిపాలనలో తొమ్మిదో స్థానం రావడం ఆహ్వానించదగినదే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు వెళుతోందని పలువురు చెబుతున్నారు.

Tags